భారత ఎన్నికల కమిషనర్‌గా.. సునిల్‌ అరోరా నేడు బాధ్యతలు స్వీకరణ

భారత ఎన్నికల కమిషనర్‌గా.. సునిల్‌ అరోరా నేడు బాధ్యతలు స్వీకరణ
x
Highlights

భారత ఎన్నికల కమిషనర్‌గా.. సునిల్‌ అరోరా ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇటీవలే ఆయన నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు....

భారత ఎన్నికల కమిషనర్‌గా.. సునిల్‌ అరోరా ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇటీవలే ఆయన నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు సీఈసీగా ఉన్న ఓం ప్రకాష్‌ రావత్‌.. తన బాధ్యతలను అరోరాకు అప్పగించనున్నారు. 1980 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన సునీల్‌ అరోరా.. దాదాపు రెండున్నరేళ్ల పాటు.. సీఈసీగా కొనసాగుతారు. ఈయన హయాంలోనే కీలకమైన 2019 సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా అరోరా హయాంలోనే వెలువడనున్నాయి. గత సెప్టెంబర్‌ నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అరోరా.. ప్రసార భారతిలో సలహాదారుగా.. ఆర్థికమంత్రిత్వ శాఖ, టెక్స్‌టైల్‌, ప్లానింగ్‌ కమిషన్‌, జౌళిశాఖల్లోనూ కీలక బాధ్యతలను నిర్వర్తించారు. గతంలో ఓపీ రావత్‌, సునీల్‌ అరోరా.. ఎన్నికల కమిషనర్లుగా వ్యవహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories