సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ ఆందోళన ఉద్రిక్తం

సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ ఆందోళన ఉద్రిక్తం
x
Highlights

సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యతిరేక ఆందోళనలు ఉధృతమౌతున్నాయి. సీబీఎస్‌ఈ పదో తరగతి మాధ్స్ , 12వ తరగతి ఎకనామిక్స్ ప్రశ్నా పత్రాలు లీకవ్వడం...ఆ...

సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యతిరేక ఆందోళనలు ఉధృతమౌతున్నాయి. సీబీఎస్‌ఈ పదో తరగతి మాధ్స్ , 12వ తరగతి ఎకనామిక్స్ ప్రశ్నా పత్రాలు లీకవ్వడం...ఆ పరీక్షలను రద్దు చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు చేసిన తప్పుకు లక్షలాది మందిని ఎలా బలి చేస్తారని ప్రశ్నిస్తూ ఢిల్లీలోని సీబీఎస్‌ఈ IP ఎక్స్‌టెన్షన్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. అటు NSUI విద్యార్థులు సీబీఎస్‌ఈ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

పరీక్ష పేపర్ల లీకేజీకి బాధ్యుడిగా మానవవనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు నినాదాలు చేశారు. సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్‌ అనిత కర్వాల్‌ ‌పై వేటు వేయాలని డామాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళల కారణంగా సీబీఎస్‌ఈ ప్రధాన కార్యాలయం దగ్గర పారా మిలటరీ బలగాల మోహరించారు. అటు జవదేకర్‌కు భద్రత పెంచారు. జవదేకర్‌ ఇంటి దగ్గర 144 వ సెక్షన్ విధించారు.

రద్దయిన పరీక్షల్ని మళ్ళీ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఉదయం కేంద్ర మంత్రి జవదేకర్ , చైర్‌పర్సన్‌ అనిత కర్వాల్‌‌తో పాటు ఇతర అధికారులతో రీ ఎగ్జామ్ తేదీలపై మంతనాలు జరిపారు. పదో తరగతి మాధ్స్ , 12వ తరగతి ఎకనామిక్స్ రీఎగ్జామ్ తేదీలను ఇవాళ సాయంత్రం ప్రకటించాలని నిర్ణయించారు. అయితే రీ-ఎగ్జామ్‌ ఢిల్లీ ప్రాంతానికే పరిమితమవుతుందా లేదంటే దేశమంతటా నిర్వహిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ కొందరు చేసిన తప్పుకు అందర్నీ శిక్షించడమేమిటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. రీఎగ్జామ్ వల్ల 16 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు 3 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు మళ్ళీ పరీక్ష రాయాల్సిఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సీబీఎస్‌ఈ పేపర్ల లీకేజీ కేసు దర్యాప్తు ముమ్మరమైంది. లీకేజీ పేపర్లను జీ మెయిల్ ద్వారా సీబీఎస్‌ఈ కార్యాలయానికి పంపింది ఎవరు..ఎక్కడి నుంచి పంపారు..? అనే కోణంలో విచారణ జరుగుతోంది. మెయిల్ చేసిన వ్యక్తి , అప్ లోడ్ చేసిన ప్రదేశం వివరాలు అందించాల్సిందిగా గూగుల్ సంస్థను పోలీసులు ఆదేశించారు. లీకేజీ వ్యవహారంలో సీబీఎస్‌ఈ అధికారుల పాత్ర ఏమిటనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అటు పేపర్ల లీకేజీకి సూత్రధారిగా భావిస్తున్న ఢిల్లీలోని ఒక కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడిని, మరో 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు. వీరిలో కొందరు 10, 11 తరగతుల విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే వెయ్యి మంది చేతికి లీకయిన పేపర్లు అందినట్లు సమాచారం. ఒక్కో విద్యార్ధి నుంచి 35 వేల నుంచి 50 వేల రూపాయల వరకు వసూలు చేసినట్టు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories