స్టీఫెన్ హాకింగ్ క‌న్నుమూత‌

స్టీఫెన్ హాకింగ్ క‌న్నుమూత‌
x
Highlights

ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ క‌న్నుమూశారు. కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన త‌న ప‌రిశోద‌న‌ల‌తో...

ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ క‌న్నుమూశారు. కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన త‌న ప‌రిశోద‌న‌ల‌తో స‌త్తాచాటుకున్నారు. మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా... చేస్తున్న పనికి శరీరం సహకరించక పోయినా... కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం. స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందించారు.
కుటుంబ నేప‌థ్యం
1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు. ఆయన తండ్రి వృత్తి రీత్యా లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల వల్ల స్టీఫెన్ తల్లిని ఆక్స్ ఫర్డ్ లోని సురక్షిత ప్రాంతానికి పంపించారు. కొంత కాలానికి ఆయన కుటుంబం లండన్ లోని హైగేట్స్ ప్రాంతానికి తరలివచ్చింది. స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని అక్కడే ప్రారంభించాడు. తర్వాత అంటే 1950లో ఆయన తండ్రి కుటుంబాన్ని మిల్ హిల్ ప్రాంతానికి మార్చాడు. తండ్రి స్టీఫెన్ ని అక్కడి సెయింట్ ఆల్బన్స్ పాఠశాలలో చేర్చాడు. తన గణిత ఉపాధ్యాయుని ప్రేరణతో గణితశాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామనుకున్నాడు స్టీఫెన్. కాని దానికి వ్యతిరేకంగా తండ్రి రసాయనశాస్త్రంలో చేర్పించాడు. తరువాత 1959లో నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్ షిప్ పరీక్ష రాశాడు. అందులో సఫలీకృతుడు కాగలిగినా... భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశాడు స్టీఫెన్. 1962లో కేవలం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కాగలిగాడు. కాస్మాలజి, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కి వెళ్ళాడు.
మ‌ర‌ణం
కాస్మాలజి, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కి వెళ్ళాడు. అప్పటి నుంచి స్టీఫెన్ పరిస్థితి పూర్తిగా మారింది. అన్నం తినాలన్నా... కనీసం బూట్ల లేసు కట్టుకుందామన్నా... స్టీఫెన్ శరీరం సహకరించేది కాదు. క్రిస్‌మస్ సెలవులకు ఇంటికి వెళ్ళిన స్టీఫెన్ పరిస్థితి ఆయన తల్లిదండ్రులను కలవర పెట్టింది. భోజనం చేయడానికి ఆయన పడుతున్న ఇబ్బంది... తల్లిని మధనపెట్టింది. ఆ సమయంలోనే ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి (Motor Neuron Disease) అనే భయంకర వ్యాధి ఉన్నట్టు తెలిసింది. దీనినే Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధి అని కూడా అంటారు. నాడీ మండలం పై అంటే నరాలు, వెన్నుపూస పై ఇది ప్రభావం చూపుతుంది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా... కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. మళ్లీ విశ్వవిద్యాలయానికి తిరిగివచ్చిన హాకింగ్ తన పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసి మిత్రులు సహకరించాలని చూసినా స్టీఫెన్ సున్నితంగా తిరస్కరించే వాడు. 2018 మార్చ్ 14 న బుధవారం ఉదయం ఆయన కేంబ్రిడ్జ్‌లోని తన నివాసంలో మరణించారు
వైవాహిక జీవితం
స్టీఫెన్‌కు ఇద్దరు భార్యలు. కేంబ్రిడ్జ్‌లో చదువుతున్న రోజుల్లో జానే విల్డే అనే అమ్మాయితో స్టీఫెన్‌కు పరిచయం ఏర్పడింది. అప్పటికి స్టీఫెన్‌ వ్యాధి బయటపడలేదు. విశ్వవిద్యాలయంలో తనకు పరిచయమున్న మహిళను స్టీఫెన్ వివాహం చేసుకున్నాడు. ఆక్స్ ఫర్డ్ లో ఉన్నప్పుడు దగ్గర లోనే ఇల్లు తీసుకుని ఉండేవాడు. అయితే వ్యాధి గురించి తెలిశాక కూడా జానే పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకొన్నారు, 1965లో వీరిద్దరూ పెళ్ళీ చేసుకొన్నారు . వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల . అయితే కొన్ని కారణాల వల్ల 1995లో వీరి విడిపోయారు. ఆ తర్వాత అదే సంవత్సరం స్టీఫెన్‌.. ఎలైన్‌ మాసన్‌ అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నారు. 1980లో స్టీఫెన్‌ అనారోగ్యంలో ఉన్న సమయంలో మాసన్‌ ఆయనకు నర్స్‌గా పనిచేశారు. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే 2006లో మాసన్‌తో కూడా విడిపోయారు.
ప‌రిశోధ‌న‌లు
ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన స్టీఫెన్ కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా... మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించాడు. 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి వుందన్న విషయాన్ని కూడా మరచి పోయాడు. క్వాంటం థియరి, జనరల్ రిలెటివిటీ లను ఉపయోగించి... కృష్ణబిలాలు కూడా రేడియేషన్ ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ పుస్తకరచన ప్రారంభించాడు. ఆ సమయంలోనే వ్యాధి వల్ల 1985లో వైద్యుల దగ్గర ఉండాల్సి వచ్చింది. అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు. అది అమ్మకాల్లో సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ... కాలం కథ పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.2014: హాకింగ్ జీవిత విశేషాలతో ది థియరీ ఆప్ ఎవ్వరిథింగ్ అనే సినిమా తీశారు. దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories