గ్యాలరీలో సందడి చేస్తున్న సాక్షి, అనుష్క, అయేషా

గ్యాలరీలో సందడి చేస్తున్న సాక్షి, అనుష్క, అయేషా
x
Highlights

చీర్‌గాళ్స్‌ ఐపీఎల్ 11వ సీజన్లో....క్రికెట్ స్టార్ల భార్యలు....చీర్ గాళ్స్ ను మించిపోయి సందడి సందడి చేస్తున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే,...

చీర్‌గాళ్స్‌ ఐపీఎల్ 11వ సీజన్లో....క్రికెట్ స్టార్ల భార్యలు....చీర్ గాళ్స్ ను మించిపోయి సందడి సందడి చేస్తున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, ముంబై....వేదిక ఏదైనా....క్రికెట్ స్టాండ్స్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ భార్య సాక్షీ ఓ వైపు నుంచి సికర్ బేబీ సిక్సర్ అంటూ ఉత్సాహపరుస్తుంటే...మరోవైపు బెంగళూరు కెప్టెన్ విరాట్ కొహ్లీ భార్య అనుష్క శర్మ మాత్రం...బోర్ బేబీ బోర్ అంటూ...నిరుత్సాహ పడుతోంది....

ఐపీఎల్ 11వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి అంచె...ఏడురౌండ్ల మ్యాచ్ లు ముగియడంతో....పోటీలు మరింత వేడెక్కాయి.మ్యాచ్ అంచనాలకు అందకుండా...ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగుతుండడంతో....ఓ వైపు అభిమానులు, చీర్ గాళ్స్...మరోవైపు...స్టేడియం స్టాండ్లలో కొలువైన...స్టార్ క్రికెటర్ల భార్యలు భావోద్వేగాలను అణచుకొంటూ....తీవ్రఉత్కంఠకు గురవుతున్నారు.

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కొహ్లీ మ్యాచ్ లు ఆడుతుంటే అతని భార్య అనుష్క శర్మ...చిన్నస్వామి స్టేడియానికి వచ్చి మరీ ఉత్సాహపరుస్తోంది. ఇక...చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షీ తన కుమార్తె జీవాతో కలసి వచ్చి మరీ....సిక్సర్ల కింగ్ లో సరికొత్త ఉత్సాహం నింపుతోంది. అంతేనా....ముంబై ఇండియన్స్ కెప్టెన్ రితిక....హైదరాబాద్ సన్ రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ భార్య అయేషా.....కోల్ కతా నైట్ రైడర్స్ సారథి దినేశ్ కార్తీక్ భార్య దీపిక పల్లికల్...సురేశ్ రైనా భార్య ప్రియాంక సైతం....మ్యాచ్ లకు హాజరవుతూ...తమ పతిదేవుళ్లలో సరికొత్త ఉత్సాహం నింపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories