బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య వెనుక వీరేశం హస్తముంది..

బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య వెనుక వీరేశం హస్తముంది..
x
Highlights

కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల జోలికొస్తే తాట తీస్తామని తెలంగాణా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. నల్గొండ...

కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల జోలికొస్తే తాట తీస్తామని తెలంగాణా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. నల్గొండ చైర్‌పర్సన్‌ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ సంతాపం సభకు రాష్ట్ర కాంగ్రెస్‌ అతిరథ మహారథులంతా కదలి వచ్చారు. ఇప్పుడు అధికారం ఉందని కదా అని రెచ్చిపోతే.. భవిష్యత్‌‌లో చింతించాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు ఘాటుగా హెచ్చరించారు. నల్గొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యలో ఎమ్మెల్యే వీరేశం హస్తముందని మాజీ ఎంపీ వీహెచ్‌ ఆరోపించారు. లోకల్‌ పోలీసు అధికారులు కూడా అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. శ్రీనివాస్‌ హత్య కేసును సీబీఐకి అప్పచెప్పాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికొస్తే అధికార పార్టీ అంతు చూస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ఇటీవల హత్యకు గురైనా నల్లగొండజిల్లా మంత్రి కనీసం సంతాపం కూడా తెలపలేదన్నారు. బొడ్డు శ్రీనివాస్‌ హత్య వెనుక అధికార పార్టీ హస్తముందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసుల అందదండలతో టీఆర్‌ఎస్‌ నేతలు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

బొడ్డుపల్లి శ్రీనివాస్‌‌ని ప్రభుత్వ అండదండలతో హత్య చేశారని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణా చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో బొడ్డుపల్లిని కిరాతకంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న, చంపిస్తున్న వారిని అధికారంలోకి వస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories