బోనీ క‌పూర్ పై అనుమానం

బోనీ క‌పూర్ పై అనుమానం
x
Highlights

అందాల తార శ్రీదేవి డెత్ మిస్టరీగా మారింది. ఆమె చ‌నిపోయి 40గంట‌లు దాటిన డెడ్ బాడిని ఇండియాకి తిరిగి తెచ్చే ప్ర‌య‌త్నాలు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ...

అందాల తార శ్రీదేవి డెత్ మిస్టరీగా మారింది. ఆమె చ‌నిపోయి 40గంట‌లు దాటిన డెడ్ బాడిని ఇండియాకి తిరిగి తెచ్చే ప్ర‌య‌త్నాలు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈమె మ‌ర‌ణంపై అనేక అనుమానాల్ని తావిచ్చేలా ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఆమె బాత్ ట‌బ్ లో ప‌డి చ‌నిపోయార‌ని వ‌చ్చింది . దీంతో మ‌రిన్ని అనుమానాలు ప్ర‌స్పుట‌మ‌వుతున్నాయి. బాత్ టబ్ లో ప‌డి శ్రీదేవి ఎలా చనిపోతుంది అని. ఇదే విష‌యంపై దుబాయ్ ప్రాసిక్యూష‌న్ కూడా అనుమానం వ్య‌క్తం చేసింది. ఆమె బాత్ ట‌బ్ లో ప‌డి చ‌నిపోయింద‌ని నిర్ధారించ‌లేమ‌ని, కేసును మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేప‌ట్టాల్సి వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రీదేవి డెత్ మిస్టరి పై క్ష‌ణం క్షణం ఉత్కంట‌త‌ను రేపుతుంది.
దీనంత‌టికి దుబాయ్ లో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లే కార‌ణ‌మ‌ని ప్రాసిక్యూష‌న్ చెబుతోంది.
బోనీ మేన‌ళ్లుడి వివాహానికి దుబాయ్ వ‌చ్చిన శ్రీదేవి ఆ ఫంక్ష‌న్ లో బాగా ఎంజాయి చేశారు. అనంత‌రం శ్రీదేవి దుబాయ్ లో ఉండ‌గా ..బోనీ త‌న చిన్న కూతురుతో క‌లిసి ముంబై వ‌చ్చారు. అయితే షెడ్యూల్ ప్ర‌కారం నాలుగు రోజుల తరువాత దుబాయ్ కి రావాల్సిన బోనీ అదే రోజు దుబాయ్ చేరుకున్నారు. శ్రీదేవిని స‌ప్రైజ్ చేద్దామ‌ని . అప్ప‌టికే హోట‌ల్ గ‌దిలో నిద్రపోతున్న శ్రీదేవి త‌న భ‌ర్త బోనీని చూడ‌డంతో నిజంగానే స‌ప్రైజ్ అయ్యింది. ఇద్ద‌రు కాసేపు మాట్లాడుకొని డిన్న‌ర్ కి బ‌య‌ట‌కి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. శ్రీదేవి తాను ఫ్రెష్ అవ్వాల‌ని బాత్రూంలోకి వెళ్లింది. ఎంత సేప‌టికి తిరిగి రాక‌పోయే స‌రికి అనుమానం వచ్చిన బోనీ హోట‌ల్ సిబ్బంది సాయంతో ఆ బాత్రూండోర్ ను బ్రేక్ చేశారు. అయితే బాత్రూంలో చ‌ల‌నం లేకుండా ప‌డి ఉన్న శ్రీదేవిని చూసి షాక్ తిన్నారు. త‌క్ష‌ణ‌మే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించి బ్ర‌తికుంచుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. శ్రీదేవి చ‌నిపోయింద‌ని డాక్ట‌ర్ల చెప్పారు. అప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు శ్రీదేవి మ‌ర‌ణం పై స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది.
దుబాయ్ చ‌ట్టాల ప్ర‌కారం ఎవ‌రైనా చ‌నిపోతే ఎందుకు చ‌నిపోయారు అన్న విష‌యాల‌పై విచార‌ణ చేప‌ట్టిన అనంత‌రం మృత‌దేహాన్ని అప్ప‌గిస్తారు.
ఇప్పుడు శ్రీదేవి మ‌ర‌ణంపై అదే విచార‌ణ కొన‌సాగుతుంది. ఈ విచార‌ణలో తొల‌త శ్రీదేవి గుండెపోటు వ‌ల్ల చ‌నిపోయార‌ని ఆమె కుటుంబ‌స‌భ్యుల్లో ఒక‌రు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఆమె బాత్ ట‌బ్ లో ప‌డి చ‌నిపోయిన‌ట్లు వ‌చ్చింది. అంతేకాదు ఆమె శరీరంలో ఆల్క‌హాల్ ఉంద‌ని అక్క‌డి వైద్యులు చెప్ప‌డంతో కేసుపై అనుమానాలు పెరిగిపోయాయి. దీంతో కేసును ప్రాసిక్యూష‌న్ కు అప్ప‌గించారు. ప్రాసిక్యూష‌న్ విచారణలో శ్రీదేవి మ‌ర‌ణంపై ప‌లు అనుమానాలు వ్య‌క్త మ‌య్యాయి.
- తొల‌త శ్రీదేవి గుండెపోటుతు చ‌నిపోయార‌ని
- శ్రీదేవి బాత్రూంలో ప‌డిచ‌నిపోయార‌ని
- శ్రీదేవి మృత‌దేహంలో ఆల్క‌హాల్ ఉన్న‌ట్లు అనుమానాలు
- భ‌ర్త బోనీ క‌పూర్ చెప్పిన స‌మాదానాలు . వీటిపై అనుమానం వ్య‌క్తం చేసిన ప్రాసిక్యూష‌న్ విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు బోనీ కుటుంబ‌స‌భ్యులు దుబాయ్ లో ఉండాల‌ని ఆదేశించింది. అంతేకాదు శ్రీదేవి కాల్ డేటా, బోనీ కాల్ డేటాను, వారి పాస్ పోర్ట్ ల‌ను త‌మ ఆదీనంలో ఉంచుకున్నారు. బోనీ చెప్పిన స‌మాధానాల‌తో అసంతృప్తి వ్య‌క్తం చేసిన ప్రాసిక్యూష‌న్ లోతుగా ఈ కేసును విచారించాల‌ని తెలిపింది. దీంతో ఈరోజుకూడా శ్రీదేవి మృత‌దేహం ఇండియా రావ‌డం క‌ష్ట‌మేన‌ని ప‌లువురు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories