దారుణం..అత్యాచారం చేసి తల్లిని హత్య చేసిన కొడుకు

దారుణం..అత్యాచారం చేసి తల్లిని హత్య చేసిన కొడుకు
x
Highlights

మద్యం మత్తు‌లో ఓ కొడుకు పేగు బంధాన్ని మరిచాడు. నవమాసాలు మోసి‌న తల్లినే అత్యాచారం చేసి హత్య చేశాడు. చిత్తూరు జిల్లా వికోట మండలం శివునికుప్పం గ్రామంలో ఈ...

మద్యం మత్తు‌లో ఓ కొడుకు పేగు బంధాన్ని మరిచాడు. నవమాసాలు మోసి‌న తల్లినే అత్యాచారం చేసి హత్య చేశాడు. చిత్తూరు జిల్లా వికోట మండలం శివునికుప్పం గ్రామంలో ఈ దారుణం జరిగింది. కసాయి కొడుకుని పట్టుకున్న గ్రామస్థులు అతణ్ణి స్తంభానికి కట్టి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

చిత్తూరు జిల్లా వి,కోట మండలం శివునికుప్పం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం తల్లితో పాటు నివాసం ఉంటున్నాడు. అతను చెడు వ్యసనాలకు బానిసై దారుణాలు చేసేవాడు. ఇవాళ ఫూటుగా మద్యం తాగి తల్లిపై అఘాయిత్యానికి పాల్సడ్డాడు. పైగా అమ్మ మెడకు ఉరివేసి ప్రాణాలు తీశాడు. అంతేకాదు నిందితుడు సుబ్రహ్మణ్యం గతంలో సొంత చెల్లిని కూడా రేప్ చేశాడు. అప్పట్లో గ్రామస్థులు అతన్ని పట్టుకొని పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి అతన్ని ఊరి నుండి వెలివేశారు. అయినా తీరు మార్చుకోని సుబ్రహ్మణ్యం ఇప్పుడు తల్లి పట్ల అమానుషంగా వ్యవహరించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories