న‌డ‌క‌తో మద్యపానం దూరం

న‌డ‌క‌తో మద్యపానం దూరం
x
Highlights

ధూమపానం, మద్యపానం వంటి దుర్వ్యసనాలను మానుకోవడం అంత ఈజీకాదు.. ఎంత వద్దనుకున్నా.. మనసు వాటిపైకే పీకుతూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ సిగరెట్లని.. అవనీ ఇవనీ...

ధూమపానం, మద్యపానం వంటి దుర్వ్యసనాలను మానుకోవడం అంత ఈజీకాదు.. ఎంత వద్దనుకున్నా.. మనసు వాటిపైకే పీకుతూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ సిగరెట్లని.. అవనీ ఇవనీ ఎన్ని మాయోపాయాలు ఉన్నా.. పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో లండన్‌లోని సెయింట్ జార్జి యూనివర్సిటీ పరిశోధకులు ఒక చక్కని చిట్కా చెప్పారు.

పొగ మానేయాలని సంకల్పించుకన్నవారు రోజూ కొద్దిసేపు పరిగెడితే, ఆ దురలవాటు నుంచి బయటపడొచ్చని వారు చెబుతున్నారు. కొద్దిసేపు అలా పరిగెత్తడం వల్ల.. పొగ మానొచ్చని, ఆరోగ్యం కూడా చేకూరుతుందని పేర్కొంటున్నారు. ఇదేదో తమాషాకు చెబుతున్న సలహా కాదండోయ్.. వీరు ఎలుకలపై పరిశోధన చేసి మరీ ఈ ఉపాయం చెప్పారు.

పరిశోధనలో భాగంగా ఎలుకలపై నికోటిన్‌ ప్రయోగించారు. తర్వాత వాటిని రెండు చక్రాలపై పరిగెత్తించారు. ఫలితంగా వాటిలో నికోటిన్ లక్షణాలు బాగా తగ్గాయి. అయితే మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు. పరిశోధన ఫలితాలను బ్రిటిష్ జర్నల్‌ ఆఫ్‌ ఫార్మాకాలజీలో ప్రచురించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories