ఒకే చీరలో 220 రంగులు... సిరిసిల్ల నేతన్న ప్రతిభ

ఒకే చీరలో 220 రంగులు... సిరిసిల్ల నేతన్న ప్రతిభ
x
Highlights

చేనేతకు చిరునామా అయిన సిరిసిల్ల.. మరో ‌ఖ్యాతిని సంపాదించింది. ఒకే చీరలో ఏకంగా 220 రంగులను అద్దుకుని.. మరింత సింగారించుకుంది. అబ్బురపర్చే రంగులతో...

చేనేతకు చిరునామా అయిన సిరిసిల్ల.. మరో ‌ఖ్యాతిని సంపాదించింది. ఒకే చీరలో ఏకంగా 220 రంగులను అద్దుకుని.. మరింత సింగారించుకుంది. అబ్బురపర్చే రంగులతో మురిసిపోతోంది. చేనేత కార్మికుడి చేతి నుంచి జాలువారింది. ఒక చీరపై ఏకంగా 220 రకాల రంగులద్దారు. మరిప్పుడేమంటారో తెలీదు కానీ.. ఇది నిజం. సిరిసిల్ల చీర మరో ఖ్యాతిని మూటగట్టుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రెండు వందలకు పైగా రంగులతో చీరను తయారు చేశారు. 5 మీటర్ల పొడవైన చీరలో అన్ని రంగులను అద్ది.. రికార్డు సృష్టించారు.

ఈ చేనేత కార్మికుడి పేరు.. నల్ల విజయ్. తన వృత్తిలో ఆరితేరిన విజయ్.. తన కళా నైపుణ్యంతో.. అరటినారతో శాలువా, కుట్టులేని పైజామా తయారు చేసి.. వస్త్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మరమగ్గంపై 220 రంగులతో 5 మీటర్ల పొడవైన కాటన్, పాలిస్టర్ చీరలను రూపొందించాడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న విజయ్.. సరికొత్త ఆలోచనలకు కేరాఫ్ గా మారాడు. ఆర్థిక ఇబ్బందులున్నా.. తన సృజనాత్మకకు అవేవీ అడ్డుకావంటున్న విజయ్.. ప్రోత్సహమిస్తే మరిన్ని అద్భుతాలు చేసి చూపిస్తానని చెబుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories