రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సింగ‌ర్ సునీత‌

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సింగ‌ర్ సునీత‌
x
Highlights

సుమధుర గానంతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గాయని సునీత మరో పెళ్లి చేసుకోబోతున్నట్టు గురువారం సోషల్‌ మీడియాలో ఓ వార్త...

సుమధుర గానంతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గాయని సునీత మరో పెళ్లి చేసుకోబోతున్నట్టు గురువారం సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అయింది. ఈ వార్తపై ఆమె స్పందించారు. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని ఫేస్‌బుక్‌ లైవ్‌ వీడియోలో ఆమె స్పష్టం చేశారు. మీ ఆద‌ర‌ణ వ‌ల‌న ఇప్ప‌టికి హ్యాపీగా పాట‌లు పాడుకుంటూ ఉన్నాను. కాని నిన్న‌టి నుండి నేను రెండో పెళ్ళి చేసుకోబోతున్న‌ట్టు నా ఫోన్‌కి మెసేజ్‌లు వ‌స్తున్నాయి. దాదాపు అన్నీ వెబ్ సైట్స్ నేను పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు రాసాయి. కాని ఇందులో ఏ మాత్రం నిజం లేదు. మీ అంద‌రి ఆద‌ర‌ణ వ‌ల‌న హ్యాపీగా ఉన్నాను. ప్ర‌స్తుతానికి పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదు. భ‌విష్య‌త్‌లో ఏదైన ఉంటే త‌ప్ప‌కుండా మీకు నేను చెబుతాను. ఈ టైంలో ఇలాంటి వ‌దంతులు సృష్టించ‌డం స‌రికాదు అంటూ సునీత వీడియోలో తెలిపారు. ప్ర‌స్తుతం సునీత త‌న ఇద్ద‌రి పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటుంది. చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన 'సునీత ఉపద్రష్ట'.. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా 750కిపైగా చిత్రాలకు పని చేశారు. 19 ఏళ్ల వయసులోనే కిరణ్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన సునీతకు ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories