ఉత్తరాదిని కుదిపేస్తున్న ఇసుక తుఫాను

ఉత్తరాదిని కుదిపేస్తున్న ఇసుక తుఫాను
x
Highlights

ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని ఓ వైపు మంచు తుపాన్లు వణికిస్తుంటే .. మిగిలిన ఉత్తరాది రాష్ట్రాలను ఇసుక తుఫానులు వణికిస్తున్నాయి. రాజస్ధాన్‌, హిమాచల్ ప్రదేశ్‌,...


ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని ఓ వైపు మంచు తుపాన్లు వణికిస్తుంటే .. మిగిలిన ఉత్తరాది రాష్ట్రాలను ఇసుక తుఫానులు వణికిస్తున్నాయి. రాజస్ధాన్‌, హిమాచల్ ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, ఢిల్లీలను ఇసుకు తుఫాను కుదిపేసింది. పెనుగాలుల ధాటికి హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఇళ్ల పైకప్పులు లేచిపోగా.. రహదారులు జలమయమయ్యాయి. హరి‍యాణా, పంజాబ్ రాష్ట్రాల్లో సాయంత్రం కాగానే రోడ్లు నిర్మానుషంగా మారుతున్నాయి. గాలులు ప్రారంభం కాగానే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు సూచించింది. ఇసుక తుఫానుల కారణంగా ఐదు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 134 మంది మృతిచెందినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.

ఇసుక తుపానుల ప్రభావం మరో 24 గంటలు ఉండొచ్చని వాతావరణశాఖ ప్రకటించింది. గంటకు 70 కిమీవేగంతో ఈదురు గాలులు ఉండొచ్చని హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గాలులు వీస్తున్న సమయంలో తీసు్కోవలసిన జాగ్రత్తలను సామాజిక మాధ్యమాలు, ప్రభుత్వ, ప్రయివేటు ప్రసార సాధానాల ద్వారా వివరిస్తున్నారు. ఇప్పటికే అధికారుల సెలవులను రద్దు చేసిన పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలు తక్షణమే విధుల్లో చేరాలంటూ ఆదేశాలు జారీ చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories