సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష
x
Highlights

కృష్ణజింకల కేసులో సల్మాన్‌‌ఖాన్‌‌ను దోషిగా తేల్చిన జోథ్‌పూర్‌ కోర్టు.... ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్‌ 51కింద తీర్పు...

కృష్ణజింకల కేసులో సల్మాన్‌‌ఖాన్‌‌ను దోషిగా తేల్చిన జోథ్‌పూర్‌ కోర్టు.... ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్‌ 51కింద తీర్పు వెలువరించింది. ఇదే కేసులో మిగతా నిందితులను జోథ్‌పూర్‌ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దాంతో సైఫ్ అలీఖాన్‌‌, టబూ, సోనాలీ బింద్రే, నీలమ్‌లు... కేసు నుంచి బయటపడ్డారు.

1998లో 'హమ్‌ సాత్ సాత్‌ హై' సినిమా షూటింగ్‌ సందర్భంగా.... రాజస్థాన్‌ జోథ్‌పూర్‌ అడవుల్లో రెండు కృష్ణజింకలను వేటాడినట్లు సల్మాన్‌‌ ఆరోపణలు వచ్చాయి. దాంతో 1998 అక్టోబర్‌‌లో వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్‌ 51కింద కేసు నమోదైంది. ఇతర నటులపై సెక్షన్ 149కింద కేసు నమోదు చేశారు. సుమారు 20ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత జోథ్‌‌పూర్‌ కోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించింది.

కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌‌ఖాన్‌‌కు జోథ్‌‌పూర్‌ కోర్టు... ఐదేళ్ల జైలుశిక్ష విధించడంతో సల్లూభాయ్‌‌ సినీ కెరీర్‌‌కు బిగ్‌ బ్రేక్ పడింది. సల్మాన్‌‌‌కు జైలుశిక్ష పడటంతో అతనితో సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories