న‌దుల‌న్నీ ఇలా శుభ్ర‌ప‌డితే...

న‌దుల‌న్నీ ఇలా శుభ్ర‌ప‌డితే...
x
Highlights

ఒక నదిని ప్రక్షాళన చేయాలంటే ఎంత కాలం పడుతుంది? నెలలు.. సంవత్సరాలు.. మూసీనది విష యం చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఈ నదిని ప్రక్షాళన...

ఒక నదిని ప్రక్షాళన చేయాలంటే ఎంత కాలం పడుతుంది? నెలలు.. సంవత్సరాలు.. మూసీనది విష యం చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఈ నదిని ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాలు తలపెడుతున్నా, ఇప్పటికీ అది పూర్తి స్థాయిలో జరగలేదు. ఒకవైపు శుభ్రం చేస్తున్నా మరోవైపు నుంచి కాలుష్యం వచ్చి పడుతుండటంతో పరిస్థితి మళ్లీ మామూలైపో తోంది. కానీ.. వారణాసిలో మాత్రం ఒక నదిని కేవలం రెండంటే రెండేనెలల్లో మొత్తం ప్రక్షాళన చేసేశారు. అ క్కడి అస్సి నదిలోని కాలుష్యం మొత్తాన్ని బయోరీ మెడిటేషన్ పద్ధతి ఉపయోగించి తీసేశారు. అతి తక్కువ సమయంలోనే అత్యంత ఎక్కువ ఫలితాలను సాధించి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచారు.

నదులు కలుషితం అవ్వడం ఇప్పటి విషయం కాదు. ఎప్పటినుంచో క్రమంగా అవుతూనే ఉన్నాయి. ఇళ్లలోని వ్యర్థాల నుంచి వ్యవసాయ, పారిశ్రామిక వ్యర్థాల వరకు అన్నింటినీ నదుల్లోకే వదిలేయడం వల్ల ఒకప్పుడు తాగునీటికి కూడా ప్రధాన వనరులుగా ఉండే నదులు ఇప్పుడు కాలుష్య కాసారాలుగా, మురికి గుంటల కంటే దారుణంగా తయారయ్యాయి. దాం తో వాటిని ప్రక్షాళన చేయాలంటే తలకు మించిన భారం అవుతోంది. పైపెచ్చు ఎంత చేసినా మళ్లీ మళ్లీ మురికి చేరుతూనే ఉంటోంది. దాంతో అసలు వీటిని బాగుచేయడం మన వల్ల కాదన్న భావన కూడా వచ్చే స్తోంది. కానీ సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఒక కాంతిపుంజంలా అస్సీ నది ప్రక్షాళన విషయం వెలు గులోకి వచ్చింది. పెద్దగా ఖర్చు కూడా ఏమీ అవ్వకుం డానే సంప్రదాయేతర పద్ధతులలో కేవలం రెండు నెలల్లోనే నదిని మొత్తం శుభ్రం చేసేశారు. ఇన్‌టాక్ అనే స్వచ్ఛంద సంస్థ అస్సీ నదిలోకి వచ్చే వ్యర్థ జలాలను ముందుగా శుభ్రం చేసింది. ఈ అస్సీనది వారణాసిలో గంగానదిలోకి అస్సీఘాట్ వద్ద ప్రవేశిస్తుంది. గంగానదిని ప్రక్షాళన చేయాలంటే ముం దుగా దానిలోకి వచ్చే ఇతర నదులను శుభ్రపరచాలని భావించి దీన్ని చేపట్టారు. బ్యాక్టీరియల్ బయోరీమె డిటేషన్ అనే పద్ధతిని ఇందులో ఉపయోగించారు. జీవ పదార్థాలను ఉపయోగించడం ద్వారా నీళ్లలోని కలుషిత పదార్థాలను దీనిద్వారా తొలగించారు.

అస్సీనది కేవలం మూడున్నర కిలోమీటర్ల పొడవున మాత్రమే ప్రవహిస్తుంది. అయితే, అంతా జనసాంద్రత బాగా ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే ప్రవహించడంతో, ఇళ్లలోంచి వచ్చే వ్యర్థాలన్నీ నేరుగా ఆ నదిలోనే కలిసిపోతుంటాయి. ఇంతకుముందు ద్వారకలోని పాలం నల్లాను 2012లోను, అంతకంటే ముందు చాణక్యపురిలోని కుశాక నల్లాను ప్రక్షాళన చేశారు. వాటి తర్వాత తూర్పు తాజ్ డ్రెయిన్ పని మొ దలుపెట్టారు. అది తాజ్ మహల్ తూర్పు ప్రవేశద్వారం గుండా వెళ్తుంది. దీని నుంచి చాలా మురుగువాసన వస్తుండటంతో పర్యాటకులు దీనిపక్క నుంచి వెళ్తుంటే ముక్కు మూసుకోవాల్సి వచ్చేది. దాంతో.. ఆ నదిని ప్రక్షాళన చేసి ఆగ్రాలోని తాజ్ అందాలను చూడాలని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఊరట కలిగించారు.

ఇవన్నీ ముగిసిన తర్వాత వారణాసిలో ని అస్సీన ది ప్రాజెక్టు కూడా ఇన్‌టాక్ చేతికి వచ్చింది. ఈ ప్రా జెక్టు చేపట్టిన కొత్తల్లో వాళ్లకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. పెద్ద మొత్తంలో చెత్త ఈ నది నీళ్లలో తేలుతూ ఉండేది. నీటి ప్రవాహం వేగంగా ఉండటంతో.. నీటిశుద్ధి చాలా కష్టం అయ్యేది. నీటి ప్రవాహానికి దగ్గరలోనే అనేక నిర్మాణాలు కూడా ఉండటంతో అక్కడ ఏ పని చేయాలన్నా జనం నుంచి నిరసనలు ఎదురయ్యేవి. దానికితోడు ఆయా ఇళ్ల నుంచి వ్యర్థ జలాలు ఎప్పటికప్పుడు మళ్లీ మళ్లీ వచ్చి పడుతుండటంతో చేసిన పని మొత్తం వృథా అయ్యేది. నది చిట్టచివరి భాగం వరకు కూడా చాలా మార్గాల నుంచి లోపలకు మురికి నీళ్లు, వ్యర్థ జలాలు, కలుషిత పదార్థాలు వచ్చి చేరుతుండేవి. అందువల్ల ఒకచోట శుభ్రం చేసినా, మరోచోట.. అలా చిట్ట చివరి వరకు పని ఉంటూనే ఉండేది. కేవలం మూడున్నర కిలోమీటర్ల నదే అయినా.. దాన్ని ప్రక్షాళన చేయడం అంత సులభంగా మాత్రం అవ్వలేదు.

తమకు ఎదురైన సవాళ్లు అన్నింటినీ అధిగమిస్తూ కేవలం రెండు నెలల్లోనే అక్కడి నీటిని చాలావరకు శుభ్రం చేశారు. దాంతో నది మళ్లీ ఒకప్పటిలా మారిపోయింది. గ్లాసులో నది నీళ్లు పట్టుకుని చూస్తే.. ఇంతకుముందుకు, ఇప్పటికి రంగులోనే చాలా తేడా కనిపించింది. ఇందుకసం రోజుకు ఇంత మొత్తంలో అని నిర్ణయించుకుని బ్యాక్టీరియాను ఇక్కడి నీళ్లలోకి వదిలారు. ప్రధానం గా నదీ ప్రవాహప్రాంతంలోని ఆరు పాయింట్లను ఎంచుకుని అక్కడ శుద్ధి చేయడం మొదలుపెట్టారు. ఈ బ్యాక్టీరియా ప్రధానంగా ఆర్గానిక్ కాలుష్యాలను పూర్తిగా నాశనం చే స్తుంది, నీళ్లలో ఆక్సిజన్‌ను కరిగిం చుకునే లక్షణాన్ని పెంచుతుంది. దానివల్ల ముందుగా దుర్వాసన పో తుంది. నీళ్లు వేగంగా ప్రవహిస్తుంటే చేసిన పని ఫలితం ఇచ్చేలోపే మళ్లీ పాడవుతుంది కాబట్టి.. ముందుగా ఆ ప్రవాహాన్ని ఆపి ఉంచారు. ఇందుకోసం పెద్దపెద్ద పరికరాలు ఉపయోగించారు. కొబ్బరి పీచును కూడా పెద్దపెద్ద చుట్టల్లా చుట్టి వాటిని నీళ్లలో వేయడం లాంటివి చేయడం ద్వారా ప్రక్షాళన కార్యక్రమాన్ని మరింత పటిష్ఠం చేశారు. నది లో తేలుకుంటూ వచ్చే చెత్తను మాత్రం మామూలు గానే తీసేయాల్సి వచ్చేది. 2016 డిసెంబర్ చివరినా టికల్లా ఇలా చేసే పని మొత్తం పూర్తయింది. దాంతో నాలుగు వారాల్లో ఫలితం బాగా కనిపించింది. నది నుంచి దుర్వాసన రావడం ఆగిపోయిందని చుట్టుప‌క్క‌ల‌ వాళ్లు చెప్పడం మొదలుపెట్టారు. నది శుభ్రంగా ఉండటంతో దాంట్లోకి చెత్త వేయడం కూడా మానేశారు.

అంతకుముందు మురికినీళ్లే కదా, మనం వేసినంత మాత్రాన ఏమవుతుందిలే అనుకున్నవాళ్లంతా.. ఆ తర్వాత నదిని తమ సొంతం అనుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రెండు నెలల నుంచి నీటిని పరీక్షించడం మొదలైంది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండు స్థాయి 83.7%కు తగ్గింది. అలాగే కెమికల్ ఆక్సిజన్ డిమాండు స్థాయి కూడా 50%కు పడిపోయింది. దాంతో నది మొత్తం మొదటి నుంచి చివరివరకు శుభ్రమైన నీళ్లతో కళకళలాడుతూ కనిపించడం మొదలుపెట్టింది. ఈ మొత్తం ప్రాజెక్టు నిర్వహణకు అయ్యిన ఖర్చు.. మొదటి సంవత్సరం రూ. 4.34 కోట్లు, ఆ తర్వాత కొన్నేళ్ల పాటు 3.75 కోట్లు మాత్రమే. అదే సంప్రదాయ పద్ధతులలో మురికి శుద్ధి ప్లాంట్ల లాంటివి పెడితే అందుకు కేవలం పరికరాల ఖర్చు రూపంలోనే రూ. 75 కోట్ల వరకు అవసరం అయ్యేది. దానికితోడు నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతభత్యాలు ఇవన్నీ అదనం. పైగా దీనికి చాలా ఎక్కువ కాలం కూడా పడుతుంది. ఫలితాలు రావాలంటే ఎక్కువ సమయం వేచి చూడాలి. ఇదంతా అవసరం లేకుండానే అస్సీ నది మొత్తం శుభ్రపడింది.

అస్సీనది బాగుపడింది.. మరి మన మూసీ సంగతేంటని చూసుకుంటే ఇది మాత్రం ఎప్పటినుంచో అలా కొనసా....గుతూనే ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద దాదాపు రూ. 4 వేల కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. ఇందుకోసం మూసీనది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థను కూడా ఏర్పాటుచేశారు. ఆ సంస్థ విజయా బ్యాంకు నుంచి రూ. 1500 కోట్ల అప్పు తెచ్చుకోడానికి అనుమతించారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ లోంచి కూడా దీనికి కొంత డబ్బు కేటాయిస్తూ వస్తోంది. మొదటి దశలో హైదరాబాద్ బాపుఘాట్ నుంచి ఈసా వరకు, ఈసా నుంచి మూసారాంబాగ్ వరకు రెండో దశ, అక్కడ్నుంచి నాగోల్ వరకు మూడో దశ, నాగోల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాకా నాలుగో దశలో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.

ప్రక్షాళనలో భాగంగా మూసీనదిలో ఎప్పుడూ నీటి ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకోవడం, ఆ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రపర్చడం, రోడ్లను విస్తరించి సుందరంగా తీర్చిదిద్దడం వంటి పనులు చేపట్టడానికి రాష్ట్ర పురపాలక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. మూసీనది కూడా ఒకప్పుడు చాలా శుభ్రంగానే ఉండేది. దీని నీళ్లతో వ్యవసాయం మాత్రమే కాకుండా తాగునీటి అవసరాలు కూడా తీరేవి. కానీ రాను రాను హైదరాబాద్‌లోని ఇళ్ల నుంచి వచ్చే కాలుష్యం అంతా దీనిలోకే చేరడం మొదలైంది. ఈ నది దుస్థితి మీద కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రయించడంతో దీని ప్రక్షాళన కార్యక్రమాన్ని తాము స్వయంగా పర్యవేక్షిస్తామని కూడా హైకోర్టు ధర్మాసనం తెలిపింది. అయినా పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ ఎప్పటికి ఫలిస్తాయో, మూసీ ఎప్పటికి బాగుపడుతుందోనని హైదరాబాదీలు ఎదురు చూస్తున్నారు.

చంద్ర‌శేఖ‌ర శ‌ర్మ‌

Show Full Article
Print Article
Next Story
More Stories