ప‌వ‌న్ క‌ల్యాణ్ ను పొగిడావా వ‌ర్మా..!

ప‌వ‌న్ క‌ల్యాణ్ ను పొగిడావా వ‌ర్మా..!
x
Highlights

అజ్ఞాతవాసి పై ఆర్జీవీ మ‌రోసారి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు. కొద్దిరోజుల క్రితం అజ్ఞాతవాసి సినిమాపై ఆర్జీవీ ఎందుకు మాట్లాడ‌లేద‌ని అంద‌రు...

అజ్ఞాతవాసి పై ఆర్జీవీ మ‌రోసారి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు. కొద్దిరోజుల క్రితం అజ్ఞాతవాసి సినిమాపై ఆర్జీవీ ఎందుకు మాట్లాడ‌లేద‌ని అంద‌రు అనుకున్నారు. కానీ ఉన్న‌ట్లుండి అజ్ఞాతవాసి గెట‌ప్ లో రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది. క‌త్తిమ‌హేష్ రివ్యూ ఎలా ఇచ్చాడు. అంటూనే త‌న అభిప్రాయాల్ని నెటిజ‌న్ల‌తో పంచుకున్నాడు. అంతేకాదు ఆర్జీవీ అభిమాని అయిన ఓ నెటిజ‌న్ అజ్ఞాతవాసి పోస్టర్ ని షేర్ చేశాడు. ఆ ఫోటోలో ప‌వ‌న్ కు బ‌దులు ఆర్జీవీ ఫోటోను ఎడిట్ చేశాడు. అంతేకాదు ఆ ఫోటో పై అజ్ఞాతవాసి పోస్టర్ ని బహిరంగవాసి త‌గిలించాడు. ఆ ఫోటోను ఆర్జీవీ షేర్ చేశాడు. దీంతో డిజాస్ట‌ర్ తో సతమతమవుతున్న అజ్ఞాతవాసికి వర్మ చేస్తున్న పోస్టులు కొంత వెటకారంగానే ఉన్నాయనే కామెంట్స్ వినిపించాయి. కామెడీగా చేసినా ఉన్నది ఉన్నట్టు ఏది తోస్తే అది మాట్లాడే వర్మకు ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని అభిమానులు అంటున్నారు. ఏదో ఒకటి చేయకపోతే ఆయన వర్మ ఎందుకు అవుతాడ‌ని సెటైర్లు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే అజ్ఞాతవాసి పై వ‌ర్మ మ‌రోసారి త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. ‘‘అజ్ఞాతవాసి రిజల్ట్‌కి డైరెక్టర్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పీకే లాంటి ఆకాశం మీద దుప్పటి కప్పడం స్టీవెన్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కెమరూన్ తరం కూడా కాదు.’’ అంటూ ట్వీట్ చేశాడు.
అజ్ఞాతవాసి డిజాస్ట‌ర్ విష‌యంలో డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌ప్పేం లేదంటూ..మొత్తం ప‌వ‌న్ చేశాడ‌నే అర్ధం వ‌చ్చేలా వ‌ర్మ త‌నదైన శైలిలో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో పవన్ కల్యాణ్‌ని వర్మ పొగిడినట్లు ఉన్నప్పటికీ.. ట్వీట్ మొత్తం చదివినవారికి మరోసారి వర్మ.. ఇన్‌డైరెక్ట్‌గా పవన్‌పై పంచ్ పేల్చాడు అనే విధంగా ఉంది

Show Full Article
Print Article
Next Story
More Stories