ఆర్జీవీ కొంప‌ముంచిన ఇంట‌ర్వ్యూ

ఆర్జీవీ కొంప‌ముంచిన ఇంట‌ర్వ్యూ
x
Highlights

జీఎస్టీ( గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌) వివాదం పై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్‌వ‌ర్మ సీసీఎస్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన విష‌యం తెలిసిందే. అయితే తాను ప‌ట్టే...

జీఎస్టీ( గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌) వివాదం పై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్‌వ‌ర్మ సీసీఎస్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన విష‌యం తెలిసిందే. అయితే తాను ప‌ట్టే కుందేలు మూడే కాళ్ల‌ని వాదించే వ‌ర్మ‌కు సీసీఎస్ పోలీసులు ఎందుకే కేసు న‌మోదు అయ్యింది అనే విష‌యంపై ఆరా తీస్తే
జ‌న‌వ‌రిలో అమెరికా పోర్న్ స్టారో మియా మాల్కోవా తో జీఎస్టీ( గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌) అనే సినిమాను తెర‌కెక్కించాడు. ఆ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో ఓ టీవీ చాన‌ల్ డిబెట్ సంద‌ర్భంగా మాట్లాడిన ఆర్జీవీ స్త్రీల అందం గురించి, సెక్స్ గురించి చ‌ర్చించాడు. ఆ సంద‌ర్భంగా సామాజిక కార్య‌క‌ర్త దేవీకి ఆర్జీవీకి మ‌ధ్య మాట‌ల యుద్ధ‌మే కొన‌సాగింది.
దేవీ - ఆర్జీవికి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది
- పోర్నోగ్ర‌ఫీ స‌మాజంలో సెక్స్ ప‌ట్ల ఉన్న రుగ్మ‌త‌ల్ని జీఎస్టీ సినిమా ప‌రిష్కారం చేస్తుందా
- స్త్రీ శ‌రీరాల్ని సురుకుగా చేయ‌డం ద్వారా..?
- సెక్స్ అనేది మొగ‌వాడి వైపు న‌డుస్తుంది అని చెప్ప‌డం ద్వారా..?
- బ‌ట్ట‌లు ఊడ‌దీసుకొని సెక్స్ గురించి చెప్ప‌డం బోల్డ్ నెస్సా..?
- అదే బోల్డ్ నెస్ అయితే బ‌ట్ట‌లు ఊడ‌దీసుకొని తిర‌గొచ్చా..?
అని ప్ర‌శ్నిస్తూ పిచ్చి - పిచ్చి అవ‌స‌రంలేని ఓ మొద్దుబారు త‌నంలోకి వెళ్లి ఆ మొద్దుబారు త‌న‌నానికి జీఎస్టీ ని విముక్తిగా ప్ర‌క‌టించ‌డం చాలా విడ్డూర‌మ‌ని అన్నారు. ఆర్జీవీ ఇవ‌న్నీ క‌ట్టిపెట్టి స‌మాజానికి ప‌నికొచ్చే ప‌నుల‌ను జ్ఞానంతో చేయాల‌ని స‌ల‌హా ఇచ్చారు. అలా కాన‌ప్పుడు ప్ర‌పంచంలో 4వేల కోట్ల పోర్నోగ్ర‌ఫీ ఛాన‌ల్స్ లో పిచ్చోళ్లంద‌రు ప‌నిచేస్తున్నారు. అలాంటి ద‌ర్రిద్ర‌పు పోర్నోగ్ర‌ఫీలో ఇదో ద‌రిద్ర‌పు పోర్నోగ్ర‌ఫీ అవుతుంద‌ని మండిప‌డ్డారు.
దీనిపై స్పందించిన ఆర్జీవీ 4ల‌క్ష‌ల పోర్నోగ్రఫీ వెబ్ సైట్లు ఉన్నాయంటున్నారు. వాటిని మీరు చూశారా..? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు దేవీ సంధించిన ప్ర‌శ్న‌ల‌కు ఘాటుగా రిప్ల‌యి ఇచ్చిన ఆర్జీవీ బెడ్ రూంలో శృంగారం చేయ‌మ‌ని చెబుతున్నట్లుంద‌ని అన్నారు. అలా మొద‌లైన ఈ వివాదం సీసీఎస్ విచార‌ణ‌కు చేరింది.
ఇద దేవీతో పాటుగా ఐద్వాకు చెందిన మణి అనే మహిళపై వ‌ర్మ దారుణంగా వ్యాఖ్య‌లు చేశార‌నే వార్త‌లు వ‌చ్చాయి. జీఎస్టీ గురించి మాట్లాడిన మ‌ణి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ఆర్జీవీ "ఈసారి మిమ్మల్ని పెట్టి తీస్తా. జీఎస్టీ పార్ట్2 ఆవిడతో తీస్తా. మియా మాల్కోవా కన్నా ఆవిడ ముఖం అందంగా ఉంది’ అని బ‌దులివ్వ‌డంతో వివాదం తలెత్తింది.
ఆ తరువాత మ‌రో ఛాన‌ల్ డిబెట్లో ఫోన్ లైన్ లో మాట్లాడిన వ‌ర్మ..తాను సరదా ధోరణిలో వ్యాఖ్యలు చేశానని.. దానికి మణి ఏమైనా ఫీల్ అయి ఉంటే సారీ చెబుతున్నానన్నారు. తన వ్యాఖ్యల కారణంగా ఆమె కానీ.. ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇబ్బందికి గురై ఉంటే.. క్షమించాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories