బ‌హిరంగంగా ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ షూటింగ్

బ‌హిరంగంగా ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ షూటింగ్
x
Highlights

క్రియేటీవ్ డైర‌క్ట‌ర్ మ‌రోబాంబు పేల్చాడు. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో డైర‌క్ట‌ర్ ఆర్జీవి ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ)...

క్రియేటీవ్ డైర‌క్ట‌ర్ మ‌రోబాంబు పేల్చాడు. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో డైర‌క్ట‌ర్ ఆర్జీవి ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాపై మ‌హిళా సంఘాలు మండిప‌డ్డాయి. స్త్రీ మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా డైర‌క్ట‌ర్ ఆర్జీవీ తెరకెక్కించాడంటూ కొన్ని చోట్ల దిష్ట‌బొమ్మ దగ్ధం చేశారు. ఈనేప‌థ్యంలో జీఎస్టీ-2లో తాను యాక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ శృంగార తార ష‌కీలా చెప్పుకొచ్చింది.
వ‌ర్మ జీఎస్టీ -2 లో యాక్ట్ చేయ‌మంటే చేస్తా. కానీ బ‌రువు త‌గ్గ‌మంటూ చెప్ప‌లేనంటూ న‌వ్వుతు సమాధానమిచ్చింది ఆమె. మ‌హిళా సంఘాలు వ్యతిరేకత‌పై ..మహిళా సంఘాలకు పనీపాట ఏముండ‌దు. కాలేజ్ స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగినులు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారో వాళ్ల‌కు తెలుసా..? తెలుసుకొని ప్ర‌శ్నించారా అంటూ మండిప‌డింది. సినిమా ను సినిమా చూడాలే త‌ప్పా. సినిమాలు విడుద‌ల ఆపేయండి అంటూ మ‌హిళా సంఘాలు ఎక్కువ చేస్తున్నాయంటూ కౌంట‌ర్ అటాక్ ఇచ్చింది.
ఇక షకిలా వ్యాఖ్య‌ల‌పై మ‌హిళా సంఘాలు ఖండిస్తున్నాయి. స‌మాజానికి మంచి చేసే సినిమాల‌ని ప్రోత్స‌హిస్తామ‌ని , అలా అని యువ‌త పెడ‌దోవ ప‌ట్టించే సినిమాల్ని వ్య‌తిరేకిస్తామ‌ని అంటున్నాయి. ఇక అస‌లు విష‌యానికొస్తే ఆర్జీవీ త‌న క్రియేటివిటీని మ‌రోసారి తెర‌పై చూపించ‌నున్నాడు. గాడ్ , సెక్స్ అండ్ ట్రూత్ బ‌హిరంగంగానే తీస్తున్న‌ట్లు ట్విట్ చేశాడు. తాను జీఎస్టీ ఫ‌స్ట్ పార్ట్ ను అన్ని తలుపులు బిగించి తీశాన‌ని, జీఎస్టీ 2మాత్రం అలాకాకుండా ఐలాండ్ లో బ‌హిరంగంగానే తీస్తా అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఆయ‌న అభిమానులు తెగ‌సంబ‌ర‌ప‌డిపోతూ మా గురువుగారు జీనియ‌స్ అంటూ పొగడ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories