‘రెంట్‌ ఫర్‌ బాయ్‌ఫ్రెండ్‌’ : కేవలం నాలుగు గంటలే.. ఎక్కడో కాదు ఇండియాలోనే..

‘రెంట్‌ ఫర్‌ బాయ్‌ఫ్రెండ్‌’ : కేవలం నాలుగు గంటలే.. ఎక్కడో కాదు ఇండియాలోనే..
x
Highlights

‘అద్దెకు అర్ధాంగి’ , ‘అద్దెకు గర్భం’ లాంటి మాటలు అప్పుడప్పుడు వింటుంటాం. అయితే వినూత్నంగా ‘రెంట్‌ ఫర్‌ బాయ్‌ఫ్రెండ్‌'(అద్దెకు స్నేహితుడు) పద్ధతి...

‘అద్దెకు అర్ధాంగి’ , ‘అద్దెకు గర్భం’ లాంటి మాటలు అప్పుడప్పుడు వింటుంటాం. అయితే వినూత్నంగా ‘రెంట్‌ ఫర్‌ బాయ్‌ఫ్రెండ్‌'(అద్దెకు స్నేహితుడు) పద్ధతి ముంబయిలో వెలుగులోకి వచ్చింది. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. అయితే ఇందులో అశ్లీలతకు అవకాశం లేదు. ఒంటరి జీవితాన్ని గడుపుతూ.. మానసికంగా క్రుంగి పోతు ఎదుటివారితో మాట్లాడాలనుకునే ఆశ ఉన్న మహిళలకు ‘మీకు మేము తోడున్నాం’ అనే భరోసా ఇచ్చేందుకే అద్దెకు స్నేహితుడు లభిస్తాడు. దీని కోసం ప్రత్యేకంగా యాప్‌ కూడా ఉంది. అయితే ఇది అందరు పురుషులకు కానేకాదు. దీనికోసం కొన్ని పరీక్షల్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. మాటతీరు, నడవడిక, బాడీ లాంగ్వేజ్‌, అతని శారీరక, మానసిక స్థితిగతులను పూర్తిగా పరీక్షించిన తరువాతే అతడిని ఎంపిక చేస్తారు. ఆ వ్యక్తికి ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. పోలీస్‌ స్టేషన్లో ఎలాంటి కేసులు ఉండకూడదు. అందుకు సంబంధించిన వివరాలు అన్ని ముందగానే అందజేయాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే దీనికి నడివయస్కులు, యువకులు, మాత్రమే అర్హులు అని ఆ యాప్ చెబుతోంది. స్నేహితుడిగా ఉండాలనుకున్న వ్యక్తి సదరు మహిళను సంతోషపెట్టే పనులు మాత్రమే చేయాలి.. కానీ ఆమెతో వెకిలి చేష్టలకు పాల్పడకూడదు, శృంగార ప్రేరేపిత పనులు అస్సలు చెయ్యకూడదు. ఆ మహిళ ఎంపిక చేసుకున్న స్నేహితుడు కేవలం నాలుగు గంటలు మాత్రమే ఆమెకు తోడుగా ఉంటాడు. ఒకవేళ ఎక్కువ సమయం కావాలనుకుంటే ముందుగానే తెలియజేయాల్సి ఉంటుందని నిర్వాహకులు యాప్ లో పొందుపరిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories