బుల్లితెర‌ ర‌ంగులరాట్నం

బుల్లితెర‌ ర‌ంగులరాట్నం
x
Highlights

ఉయ్యాలా జంపాలాతో హీరోగా ప‌రిచ‌య‌మైన రాజ్ త‌రుణ్ వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. తాజాగా రాజ్ త‌రుణ్ హీరోగా శ్రీరంజ‌ని...

ఉయ్యాలా జంపాలాతో హీరోగా ప‌రిచ‌య‌మైన రాజ్ త‌రుణ్ వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. తాజాగా రాజ్ త‌రుణ్ హీరోగా శ్రీరంజ‌ని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రంగులలాట్నం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ సినిమాలో కమెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి హైలెట్ అని చెబుతున్నారు ప్రేక్ష‌కులు.
ఎలా ఉందంటే..?
సినిమా విష‌యానికొస్తే ఏ విషయాన్నైనా లైట్‌గా తీసుకునే ఓ అబ్బాయి ప్రతి విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించే ఓ అమ్మాయి మధ్య సాగే ప్రేమకథే ఈ చిత్రం. ఈ చిత్రం ఫ‌స్టాఫ్ అంతా త‌ల్లి , కొడుకు , ప్రియురాలు, స్నేహితుడు చూట్టు సాగుతుంది. అయితే ఆ పాత్ర‌ల చుట్టూ క‌థ సాగ‌డంతో సీరియ‌ల్ ను త‌లపిస్తుంద‌ని అంటున్నారు. ఇక ఇంట‌ర్వెల్ స‌మ‌యానికి హీరో త‌ల్లి చ‌నిపోతుంది. దీంతో క‌థ మ‌లుపులు తిరుగుతుంద‌ని భావించిన ప్రేక్ష‌కుడు త‌రువాత కొన‌సాగింపు వ‌చ్చే స్టోరీతో అస‌హానానికి గుర‌వుతాడు. తరుణ్‌, ప్రియదర్శి మధ్య సన్నివేశాలు కాస్తలో కాస్త ఉపశమనం. అక్కడక్కడా ఇద్దరూ కలిసి నవ్వించారు. పతాక సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి.
ఎవరెలా చేశారంటే..?
ప్ర‌తీసినిమాలో అల‌రించే రాజ్ త‌రుణ్ ఈ సినిమాలో కూడా అలాగే అల‌రించాడు. నాచావు నేను చ‌స్తా నీకెందుకు అనే డైలాగ్ తో పాపుల‌ర్ అయిన ప్రియ‌ద‌ర్శి ఈ సినిమాలో కామెడీని పంచాడు. సితార తల్లి పాత్రలో ఆకట్టుకుంది. ప్రియదర్శి పాత్ర సినిమాకు కీలకం. అన్న‌పూర్ణ నిర్మాణ విలువలు లేవు. పాటలు బాగున్నాయి. సినిమా టేకింగ్ విష‌యంలో దర్శకురాలు శ్రీరంజని అనుభవరాహిత్యం అడుగడుగునా కనిపిస్తుంది.
బలాలు
రాజ్‌తరుణ్‌,
ప్రియదర్శి కామెడీ
బలహీనతలు
-కథ, కథనం
-సీరియ‌ల్ ను త‌ల‌పించేలా సాగదీత సన్నివేశాలు
- ఆక‌ట్టుకోని సెంటిమెంట్

Show Full Article
Print Article
Next Story
More Stories