రంగ‌స్థ‌లం స్టోరీ ఇదేనా

రంగ‌స్థ‌లం స్టోరీ ఇదేనా
x
Highlights

మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రంగస్థలం’ గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ వెబ్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. క్రియేటీవ్...

మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రంగస్థలం’ గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ వెబ్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. క్రియేటీవ్ డైర‌క్ట‌ర్ సుకుమార్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా రాంచ‌ర‌ణ్ చెవిటివాడిగా యాక్ట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.
అయితే ఇక సినిమా స్టోరీ విష‌యానికొస్తే స్టైలిష్ సినిమాలు తీసే సుకుమార్... తన పంథాను మార్చి... పల్లెటూరి కథను ఎంచుకొని...పీరియాటికల్ డ్రామాగా 1985లో జరిగిన కథను ఎంచుకోవడంతో... సినిమాపై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది.
గోదావ‌రి జిల్లాలో ఓ పేదంటి అబ్బాయికి మ‌రో డ‌బ్బున్న అమ్మాయిల మ‌ధ్య క‌థ‌నే తెర‌కెక్కించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ స్టోరీతో పాటు మెగాస్టార్ చిరంజీవి ‘ఊరికిచ్చిన మాట’ కథనే మార్చేస్తే ‘రంగస్థలం’గా సుకుమార్ తీస్తున్నాడనే ది వాద‌న‌.
ప్ర‌స్తుతం ఆ స్టోరీతో పాటు మ‌రోస్టోరీ వెలుగులోకి వ‌చ్చింది. రెండు విభిన్న‌ధృవాలైన రామ్ చరణ్(చిట్టిబాబు), ఆది పినిశెట్టి (సూరిబాబు) ఇద్దరూ అన్నదమ్ములు. రామ్ చ‌ర‌ణ్ మంచి వాడైతే, ఆదిపినిశెట్టి చెడు సావాసాల‌తో ఇంట్లోవారికి స‌మ‌స్య‌ల్ని తెచ్చిపెడుతుంటాడు. అలా ఫ‌స్టాఫ్ అలా కొన‌సాగుతుండ‌గా సెకెండ్ ఆఫ్ ప్రారంభ‌మైన ఐదునిమిషాల‌కే ఆదిపినిశెట్టిని హ‌త్య చేస్తారు. హ‌త్య చేసిన నిందితుల్ని హ‌త‌మార్చ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటాడు. చివ‌రికి వారిని హ‌త‌మారుస్తాడు. అలా ముగిసిన ఈ సినిమాపై చిరంజీవి ‘ఊరికిచ్చిన మాట’ అని గుస‌గుస‌లు వినిపించాయి. నిజానికి ఈ కథ సుకుమార్ చిన్నతనంలో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా తయారు చేసుకున్న క‌థ తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories