నోటి దుర్వాసనను నివారించే మార్గాలు

నోటి దుర్వాసనను నివారించే మార్గాలు
x
Highlights

కొందరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. కొందరు మాట్లాడుతుంటే ఎప్పుడు దూరంగా వెళతారా అనిపిస్తుంది. కారణం వారి నోటి నుంచి వచ్చే దుర్వాసన. అలాంటి వారు...

కొందరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. కొందరు మాట్లాడుతుంటే ఎప్పుడు దూరంగా వెళతారా అనిపిస్తుంది. కారణం వారి నోటి నుంచి వచ్చే దుర్వాసన. అలాంటి వారు తమలో తాము కుమిలిపోతుంటారు. నోటి దుర్వాసన కూడా చాలామందిని వేధించే సమస్య. నోటిని శుభ్రపరచుకోకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి రావచ్చు. అయితే ఈ నోటి దుర్వాసన సమస్యను కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నాలుకను ప్రతిరోజూ శుభ్రపరచుకోవడం
ఉదయాన్నే పళ్ళు తోముకునేటప్పుడు చాలామంది నాలుకను శుభ్రపరచుకునే విషయంలో అశ్రద్ధ వహిస్తారు. అలా చేయడం వల్ల నాలుకపై పొక్కులు, నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశముంది. మనం తినే ఆహార పదార్థాల్లో చాలా వరకూ రేసిజ్యు నాలుకపై పేరుకుపోతుంది. ఇది ఓవర్ నైట్ పేరుకుపోవడం వల్ల ఇన్ఫెక్ట్ అయి దుర్వాసన వచ్చే అవకాశాలున్నాయి. కడుపులో లొఎ బైల్ రాత్రి అన్నవాహిక గుండా నోట్లోకి వచ్చి అక్కడ పేరుకుపోతుంది. అందువల్ల నాలుకను బ్రష్ చేసేటప్పుడు తప్పనిసరిగా శుభ్రపరచుకోవాలి.

ఆపిల్ లేదా క్యారట్‌లను రోజు తినండి
ఆపిల్ లేదా క్యారట్‌ను రోజూ తినడం వలన పళ్ళపై ఒత్తిడి పెరిగి వాటిపై పేరుకుంటున్న మలినాలు క్లీన్ అయ్యి నోరు తాజాగా ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటుంది. సాఫ్ట్‌గా, క్రీం లాగా ఉండే ఆహార పదార్థాలు పళ్ళపై, నాలుకపై అంటుకొని బాక్టీరియాని పెంచి దుర్వాసనకు దారి తీస్తుంది. ఆహారం విషయంలో ఈ జాగ్రత్త తీసుకోవడం మేలు.

కాఫీకి బదులు గ్రీన్ టీ తాగండి
దుర్వాసనకు కాఫీ కూడా ఒక కారణం. బెడ్ కాఫీ పేరుతో పళ్లు తోముకోకుండా తాగుతుంటారు. దానివల్ల నోరు పాడవడమే కాక దుర్వాసనకు కూడా కారణమవుతుంది. అయితే ఇటీవల చేసిన ఓ పరిశోధనలో గ్రీన్ టీ ఆరోగ్యాన్నే కాకుండా శ్వాసపరమైన సమస్యలను కూడా నివారించగలదని తేలింది. అందుకే కాఫీ అలవాటను గ్రీన్ టీ తాగే విధంగా మార్చుకుంటే మంచిది.

కొబ్బరి నూనెతో పుక్కులించడం
చాలామంది నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి రకరకాల లిక్విడ్స్‌ను పుక్కిలించి ఊస్తుంటారు. కానీ ఇంట్లోనే ఉండే కొబ్బరి నూనె ఈ సమస్యను నివారించగలదని చాలామందికి తెలియదు. కొబ్బరి, కొబ్బరి నూనె ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో అని తెలిసిందే. కొద్దిపాటి కొబ్బరి నూనెను నోట్లోకి తీస్కోని నాలుగైదు సార్లు పుక్కిలించడం వలన నోట్లోని హానికారక బాక్టీరియాను నివారించి, పళ్ళ చిగుళ్లను శుభ్రంగా ఉంచుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories