పోలింగుకు నాలుగురోజుల ముందే ప్రజాకూటమికి ఎదురుదెబ్బ

పోలింగుకు నాలుగురోజుల ముందే ప్రజాకూటమికి ఎదురుదెబ్బ
x
Highlights

పోలింగుకు నాలుగురోజుల ముందే ప్రజాకూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో భాగస్వామి అయిన టీజేఎస్‌ కు ఇద్దరు ముఖ్య నేతలు రాజీనామా చేశారు. ఆ పార్టీ...

పోలింగుకు నాలుగురోజుల ముందే ప్రజాకూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో భాగస్వామి అయిన టీజేఎస్‌ కు ఇద్దరు ముఖ్య నేతలు రాజీనామా చేశారు. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రచనా రెడ్డి, మరో ముఖ్య నేత మర్రి ఆదిత్యరెడ్డిలు టీజేఎస్‌ కు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను అధ్యక్షుడు కోదండరాంకు పంపారు.పోతు పోతు టీజేఎస్‌, మహాకూటమిపై తీవ్రమైన రాజకీయ విమర్శలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కూటమి కూర్పే లేదన్నారు. ఈ విషకూటమితో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.

అలాగే ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారని, ఆయన చేసే కుట్రలు అందరికి తెలుసు.. మరో రాష్ట్రానికి చెందిన సీఎం ఇక్కడ ప్రచారానికి రావడమే తప్పని, తెలంగాణ ప్రజలు ఎంతో అవగాహన కలిగిన వారని ఆమె అన్నారు. కాగా పార్టీపై, కూటమిపై తీవ్ర విమర్శలు చేసిన రచనారెడ్డి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆదిత్యరెడ్డి లను ప్రాథమిక సభ్య త్వం నుంచి సస్పెండ్‌ చేసినట్లు టీజేఎస్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, అధికార ప్రతినిధి జి.వెంకట్‌రెడ్డి వారిని సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories