అనుష్క‌కు దూరంగా రెబల్ స్టార్

అనుష్క‌కు దూరంగా రెబల్ స్టార్
x
Highlights

అస‌లే హిట్ పెయిర్ అయిన ప్ర‌భాస్ - అనుష్క పై రూమ‌ర్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గ‌తంలో వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటున్నార‌ని అందుకు పెద్ద‌నాన్న...

అస‌లే హిట్ పెయిర్ అయిన ప్ర‌భాస్ - అనుష్క పై రూమ‌ర్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గ‌తంలో వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటున్నార‌ని అందుకు పెద్ద‌నాన్న కృష్ణంరాజు పెళ్లి చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాము జ‌స్ట్ ప్రెండ్స్ అని మాకు అలాంటి ఆలోచ‌న‌లు రాలేద‌ని ప్ర‌భాస్ ఎన్నిసార్లు ఖండించిన వాటికి పులిస్టాప్ ప‌డ‌లేదు.

తాజాగా రూమ‌ర్లుకు అగ్నికి ఆజ్యం పోసేలా అనుష్క సాహో షూటింగ్ లో ద‌ర్శ‌నిమిచ్చింది. దర్శకుడు సుజిత్, మురళి శర్మ ఉన్న ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.ఇది ఇలాఉంటే త‌మ‌పై వార్త‌లు రావ‌డం ఇష్టంలేని ప్ర‌భాస్ అనుష్క‌ను దూరం చేసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ట‌.యూవీ క్రియేష‌న్స్ బ్యానర్ ప్ర‌భాస్ కు త‌న సొంత నిర్మాణ సంస్థ‌లాంటిది. మిత్రుల భాగ‌స్వామ్యంతో పురుడు పోసుకున్న ఈ నిర్మాణ సంస్థ‌కోసం ప్ర‌మోష‌న్ల‌కు రావ‌డం కూడా మానేశాడ‌ట రెబ‌ల్ స్టార్.

భాగ‌మ‌తి హిట్ అయ్యింది. అన్నీ సెంట‌ర్ల‌లో వ‌సూళ్ల‌ప‌రంప‌ర కొన‌సాగుతుంది. అయితే ఈ చిత్ర విజ‌యోత్స‌వ వేడుక‌లు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. ఒక వేళ ఈ ప్ర‌మోష‌న్స్ కి ప్ర‌భాస్ వ‌స్తే మ‌ళ్లీ రూమ‌ర్స్ క్రియేట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ,కాబ‌ట్టి ఈ ప్ర‌మోష‌న్ల‌కు దూరంగా ఉండే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట ప్ర‌భాస్ . ఒక‌వేళ తాను స్నేహితుల కోసం చిత్ర‌విజ‌యోత్స‌వాల‌కు వ‌చ్చిన అది అనుష్క‌కోసమో వ‌చ్చార‌ని గుస‌గుస‌లాడుతారు ఇదంతా త‌ల‌నొప్పి ఎందుక‌నే ప్ర‌భాస్ సైలెంట్ గా ఉన్నాడ‌ని ఫిల్మింన‌గ‌ర్ వ‌ర్గాల టాక్. విజ‌యోత్స‌వాల‌కు ఇంకా స‌మ‌యం ఉన్నందున ఆలోచించుకోమ‌ని యూవీ నిర్మాత‌లు ప్ర‌భాస్ తో అన్నార‌ట‌. మ‌రి దీనికి ప్ర‌భాస్ ఏం చెబ‌తుతాడో వేయిట్ చేయాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories