రంగ‌స్థ‌లంలో ప‌దినిమిషాల‌కు అంత తీసుకుందా

రంగ‌స్థ‌లంలో ప‌దినిమిషాల‌కు అంత తీసుకుందా
x
Highlights

మొదటి రెండు సినిమాల్లో కాస్త పద్ధతిగా కనిపించిన పూజాహెగ్డే 'డిజె' సినిమాలో మాత్రం రెచ్చిపోయి నటించింది. బికినీ సీన్స్ లో నటించి యూత్ ను ఆకట్టుకుంది....

మొదటి రెండు సినిమాల్లో కాస్త పద్ధతిగా కనిపించిన పూజాహెగ్డే 'డిజె' సినిమాలో మాత్రం రెచ్చిపోయి నటించింది. బికినీ సీన్స్ లో నటించి యూత్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు చాలా మంది హీరోలు తమ సినిమాల్లో పూజాను హీరోయిన్ గా ఎంపిక చేయడానికి చూస్తున్నారు. ఈ క్రమంలో త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. పూజా కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
తన అందాలతో టాలీవుడ్ ప్రేక్షులను మెస్మరైజ్ చేసిన హీరోయిన్ పూజాహెగ్డే. చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా తన కొత్త సినిమా విషయాలను ట్విట్టర్ ద్వారా తెలిపింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన పూజా నటించనుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ తో కలసి కలిసి నటించనున్నందుకు ఆనందంగా ఉంది. అందరం కలిసి ఓ అందమైన సినిమా మీకందించేందుకు ఎదురుచూస్తున్నామంటూ పూజా ట్వీట్ చేసింది.
అంతేకాదు రాంచ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ డైర‌క్ష‌న్ లో వ‌స్తున్న రంగ‌స్థ‌లంలో ఐటం సాంగ్ లో పూజా అల‌రించ‌నుంది. ‘జిల్‌ జిల్‌ జిగేల్‌’ అని సాగే ఈ పాటలో డ్యాన్స్ చేసింది. అందుకుగాను ఆమె రూ.50ల‌క్ష‌ల రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు ఫిల్మింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. అలాగే ఐటం సాంగ్ లో కాజోల్ తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ త‌రువాత పూజా తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.
దాదాపు 50పైగా సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన కాజోల్ ఎన్టీఆర్ సర‌స‌న ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో ఐటం సాంగ్ చేసింది. ఆ సాంగ్ కోసం రూ. 50ల‌క్ష‌లు తీసుకున్నార‌ట‌. అలాంటిది ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమాతో ఇటీవలనే హిట్‌ అందుకున్న పూజ అంత మొత్తం డిమాండ్‌ చేయడం గమనార్హం అంటున్నారు అభిమానులు.

Show Full Article
Print Article
Next Story
More Stories