రైతులపై ప్రభుత్వవైఖరిని తప్పుబట్టిన రాహుల్, కేజ్రీవాల్

రైతులపై ప్రభుత్వవైఖరిని తప్పుబట్టిన రాహుల్, కేజ్రీవాల్
x
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ట్రాక్టర్లతో నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు చావబాదారు. పలు డిమాండ్ల...

దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ట్రాక్టర్లతో నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు చావబాదారు. పలు డిమాండ్ల సాధనకై కిసాన్‌ క్రాంతి ర్యాలీ పేరిట దాదాపు 20వేల మంది రైతులు హరిద్వార్‌ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరారు. కాగా మంగళవారం ఉదయం రైతులు ఢిల్లీలో ప్రవేశించకుండా అడ్డుకున్న పోలీసులు.. వారిపైకి బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. రైతులపై భాష్పవాయుగోళాలు ప్రయోగించి లాఠీచార్జి చేయడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. దేశానికీ స్వాతంత్య్రం తీసుకొచ్చిన గాంధీ.. జయంతి రోజున కేంద్ర ప్రభుత్వం న్యాయమైన డిమాండ్ల కోసం గళమెత్తిన రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని దుయ్యబట్టారు. మరోవైపు రైతుల ఆందోళన ఉదృతం కావడంతో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మోదీ సర్కార్‌ను విరుచుకుపడ్డారు. రైతులు ప్రభుత్వ వైఖరికి వ్యక్తిరేకంగా నిరసన తెలుపుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని.. తాము రైతులకు బాసటగా నిలుస్తామని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories