ప్రియా ప్రకాశ్‌కు షాక్‌.. పోలీస్‌ కేసు నమోదు

ప్రియా ప్రకాశ్‌కు షాక్‌.. పోలీస్‌ కేసు నమోదు
x
Highlights

సోషల్ మీడియా సంచలనం.. మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్‌పై కేసు నమోదైంది. వాలెంటైన్స్ డే కానుకగా ప్రేమికులకు అందిన ఈ రోజ్ ఫ్లవర్‌పై అదే రోజున...

సోషల్ మీడియా సంచలనం.. మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్‌పై కేసు నమోదైంది. వాలెంటైన్స్ డే కానుకగా ప్రేమికులకు అందిన ఈ రోజ్ ఫ్లవర్‌పై అదే రోజున కేసు నమోదైంది. ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు మతి పోగొట్టేసింది. ఆమె పలికించిన హావభావాలకు యూత్ ఫిదా అయిపోయింది. ఇప్పుడు ఆ హావభావాలే ఆమెకు ఇబ్బందిని తెచ్చిపెట్టాయి. ఆమె కన్నుకొట్టడంపై ముస్లింలు కన్నెర్ర చేస్తున్నారు.

అయితే ఈ బ్యూటీపై హైదరాబాద్‌లో పోలీస్‌ కేసు నమోదైంది. ఫరూక్‌ నగర్‌కు చెందిన కొంత మంది యువకులు ఫలక్‌నుమా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాట చిత్రీకరణ జరిగిందని, ప్రియా ప్రకాశ్‌తో పాటు చిత్ర నిర్మాత, దర్శకులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ వారు తమ లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories