పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా.?

పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా.?
x
Highlights

గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. రేట్స్ రూపాయల్లో పెంచుతూ.. పైసల్లో తగ్గిస్తున్నారు. దాంతో ప్రజల్లో...

గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. రేట్స్ రూపాయల్లో పెంచుతూ.. పైసల్లో తగ్గిస్తున్నారు. దాంతో ప్రజల్లో క్రమంగా అసహనం పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశమున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం నుంచి ఇరాన్‌పై అమెరికా మరోసారి ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి పూర్తిగా ఆయిల్ దిగుమతులను నిలిపేయాలని ఇండియా సహా అన్ని మిత్ర దేశాలను అమెరికా ఆదేశించింది. అమెరికా విధించిన ఈ ఆంక్షల కారణంగా ఇరాన్ ముడి చమురు ఎగుమతులు భారీగా తగ్గుతాయని ఆయిల్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది మధ్యలో రోజుకు 25 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేస్తున్న ఇరాన్.. ఏడాది చివరినాటికి 15 లక్షల బ్యారెళ్లను మాత్రమే చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని భారత్ సహా ఆయిల్ కొరత ఉన్న ఎనిమిది దేశాలు అమెరికాను కోరుతున్నాయి. వీరి అభ్యర్ధనను పరిశీలించిన అమెరికా.. ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు 8 దేశాలకు అనుమతిచ్చింది. దాంతో అమెరికా తీసుకున్న నిర్ణయం ఈ దేశాలకు పెద్ద ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాయి ఆయిల్ కంపెనీలు.

Show Full Article
Print Article
Next Story
More Stories