బోదకాల వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు : మంత్రి లక్ష్మారెడ్డి

బోదకాల వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు : మంత్రి లక్ష్మారెడ్డి
x
Highlights

రాష్ట్రంలోని బోదకాల వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు ఇస్తామని తెలిపారు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. ఆదివారం (మార్చి-25) అసెంబ్లీ ప్రశ్నోత్తరాల...

రాష్ట్రంలోని బోదకాల వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు ఇస్తామని తెలిపారు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. ఆదివారం (మార్చి-25) అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా బోదకాల వ్యాధి నివారణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 40 వేల మందికి పైగా ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. వ్యాధి సోకి పని చేసుకోలేని వారిని గుర్తించి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని అరికట్టవచ్చు. దోమలు పెరగకుండా ఎమ్మెల్యేలు.. ప్రజల్లో అవగాహన కల్పించి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శ్రీలంక దేశాన్ని పైలేరియా ఫ్రీ దేశంగా ప్రకటించారు. దేశంలో తెలంగాణను కూడా పైలేరియా ఫ్రీ రాష్ట్రంగా తయారు చేసేందుకు సభ్యులందరూ కృషి చేయాలన్నారు. దీనికి సభ్యులందరూ సహకరించాలని కోరారు. వర్షాకాలం వస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో విషజర్వాలు అధికంగా ఉండేవి. కానీ ఈసారి విషజ్వరాలు రాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దోమల నిర్మూలనకు, పరిశుభ్రత ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దోమలు లేకుండా చేయడం వల్ల విషజ్వరాలను పూర్తిగా అరికట్టవచ్చు. బోదకాల వ్యాధితో బాధపడుతున్న వారు మలవిసర్జన సమయంలో ఇబ్బంది పడుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని నరేగా ద్వారా నిర్మించే మరుగుదొడ్లలో వెస్ట్రన్ స్టెల్ మరుగుదొడ్డి నిర్మించాలని అధికారులకు ఆదేశాలిచ్చామని మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories