ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా టైటిల్ అదిరింది

ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా టైటిల్ అదిరింది
x
Highlights

భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ‘అజ్ఞాతవాసి’ అంచ‌నాల్ని అందుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిలబ‌డింది. దీంతో ప‌వ‌న్ అభిమానులు ఢీలా ప‌డిపోయారు. త‌మ అభిమాన న‌టుడి...

భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ‘అజ్ఞాతవాసి’ అంచ‌నాల్ని అందుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిలబ‌డింది. దీంతో ప‌వ‌న్ అభిమానులు ఢీలా ప‌డిపోయారు. త‌మ అభిమాన న‌టుడి సినిమా రికార్డ్ ల‌ను క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొడుతుంటే ఆనందించాల‌ని అనుకున్నారు. కానీ ఫ‌లితం డిజాస్ట‌ర్ టాక్ రావ‌డంతో జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ అభిమానుల్లో జోష్ నింపేలా ఓ వార్త సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. 2019ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌వ‌న్ ‘అజ్ఞాతవాసి’ చివ‌రి సినిమా అనుకున్నారు. అయితే ప‌వ‌న్ ‘అజ్ఞాతవాసి’తో ఆగిపోడం లేద‌ని..."చ‌రిత్ర" తిర‌గ‌రాసేలా మ‌రో కొత్త సినిమాతో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌న‌నున్న‌ట్లు టాక్. అంతేకాదు ఈ సినిమా సైతం ప‌వ‌న్ అభిమానుల్ని రోమాలు నిక్క‌పొడిచే టైటిల్ ప్ర‌చారంలో రావ‌డంతో ఆయ‌న అభిమానులు ఫుల ఖుషీగా ఉన్నారు.
నిజానికి రాజ‌కీయాలు, సినిమాలు అంటూ రెండు ప‌డ‌వ‌ల‌మీద ప‌వ‌న్ ప్ర‌యాణం చేయ‌డం సుర‌క్షితం కాక‌పోయినా ముందుగా ప్ర‌క‌టించిన ప్రాజెక్ట్ ప‌నుల్ని పూర్తి చేసే ప‌నిలోప‌డ్డాడు .ఈ నేప‌థ్యంలో అజిత్ వేదాళం రీమేక్ లో ప‌వ‌న్ యాక్ట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా ఇప్ప‌టికే ప్రారంభం అయిన కొన్ని కార‌ణ‌ల‌వ‌ల్ల ఆగిపోయింది. ఇప్పుడు అదే సినిమా ఫిబ్రవరి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అనంత‌రం ప‌వ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories