మైత్రి మూవీమేక‌ర్స్ నిర్మాణంలో ప‌వ‌న్ మ‌రో కొత్త సినిమా

మైత్రి మూవీమేక‌ర్స్ నిర్మాణంలో ప‌వ‌న్ మ‌రో కొత్త సినిమా
x
Highlights

ప‌వ‌న్ క‌ల్యాణ్ చేయ‌బోయే కొత్త సినిమా షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. జ‌న‌సేనాని తెలుగురాష్ట్రాల్లో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా...

ప‌వ‌న్ క‌ల్యాణ్ చేయ‌బోయే కొత్త సినిమా షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. జ‌న‌సేనాని తెలుగురాష్ట్రాల్లో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కరీంనగర్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్ర‌క‌టించాడు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు గౌరవం ఇవ్వాలని గొడవలతో సమస్యలు పరిష్కారం కావని పవన్‌ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో తాను మాట్లాడుతున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సున్నిత అంశాలు చాలా ఉన్నాయని, ఇరు రాష్ట్రాల్లోనూ నిర్మాణాత్మక రాజకీయ పాత్ర పోషిస్తామని పవన్‌ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి జనసేన అధినేత పవన్‌ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన బలమేంటో తెలుస్తుందన్నారు. అభిమానులకు పవన్‌ షాకిచ్చారు. సినిమాలపై తనకిక దృష్టి లేదని తేల్చి చెప్పారు. పాదయాత్రతో పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్‌... సినిమాలను వదులుకుంటున్నట్టు ప్రకటించారు.
అయితే సినిమాల‌పై ఇచ్చిన ప్ర‌క‌ట‌న ఉత్తిదే అని అనిపిస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలోగా ముందుగా క‌మిట్మెంట్ ఇచ్చిన సినిమాల్ని పూర్తి చేయాల‌ని ఆత‌రువాత పూర్తి స్థాయి రాజ‌కీయాల్లో క్రియా శీల‌కంగా పని చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. అసలే అజ్ఞాత వాసి ఫ్లాప్ తో ఉన్న ప‌వ‌న్ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో త‌మిళ సినిమాను రిమేక్ చేయ‌నున్నారు. సినిమా షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.
ఎన్నిక‌ల స‌మ‌యానికి కొత్త సినిమా పూర్తి చేసి..పూర్తి స్థాయిలో సినిమాల‌కు రాం...రాం చెప్ప‌నున్నార‌ట‌. మరోవైపు ఎన్నికలు వ‌స్తున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాలు చేయ‌డం ఆశ్చ‌ర్య‌కరంగా అనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories