ప‌వ‌న్ పెట్టిన చిచ్చు..కేంద్రంలో సెగ‌లు పుట్టిస్తున్నాయ్

ప‌వ‌న్ పెట్టిన చిచ్చు..కేంద్రంలో సెగ‌లు పుట్టిస్తున్నాయ్
x
Highlights

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ రేపిన చిచ్చు కేంద్ర లో సెగ‌లు పుట్టిస్తున్నాయి. ఏ మూహూర్తానా కేంద్రంపై అవిశ్వాసం పెట్టాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశారో...

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ రేపిన చిచ్చు కేంద్ర లో సెగ‌లు పుట్టిస్తున్నాయి. ఏ మూహూర్తానా కేంద్రంపై అవిశ్వాసం పెట్టాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశారో అప్ప‌టి నుంచి ఏపీ - కేంద్ర రాజ‌కీయం మొత్తం మారిపోయింది.
వైసీపీ - టీడీపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌క‌టించాయి. అన్న‌ట్లు గానే అవిశ్వాస తీర్మానం పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్టాల‌ని ఆందోళ‌న చేప‌ట్టాయి. ఓ వైపు వైసీపీ ఎన్డీఏ పెద్ద‌ల‌తో ఏపీకి ప్ర‌త్యేక‌హోదా అంశంపై చ‌ర్చిస్తుంటే..టీడీపీ.., బీజేపీ వ్యతిరేక పార్టీల‌తో మ‌ద్ద‌తు కూడగ‌ట్టుకుంటున్నారు. మొత్తానికి ఏపీ రాజ‌కీయం మొత్తం దేశం మొత్తం తిరుగుతుంది. దీనంత‌టికి కార‌ణం ఎవ‌రా అని విశ్లేషిస్తే . ఇంకెవ‌రు ప‌వ‌న్ క‌ల్యాణేన‌ని చెప్పుకోవ‌చ్చు.
ప‌వ‌న్ క‌ల్యాణ్ వైసీపీ - టీడీపీల‌కు స‌వాల్ విసిరారు. మీకు చిత్త శుద్ది ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు క‌దా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజకీయం అని చెప్పిన టీడీపీ మార్చి 5వ తేదీన అవిశ్వాసం పెడతానంటే తాను మార్చి 4నే ఢిల్లీకి వచ్చి ఎంపీల మద్దతు కూడగడతానని పవన్ ప్రకటించారు. అంతే ప‌వ‌న్ ఆగ్ర‌హానికి ఆజ్యంపోసేలా పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ తాను కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌క‌టిస్తాం. మ‌రి ప‌వ‌న్ టీడీపీ ఎంపీల మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తారా అంటూ ప్ర‌శ్నించారు
అప్పుడే మొద‌లైంది అస‌లైన రాజ‌కీయం . జ‌గ‌న్ కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌క‌టించారు. అనుకూల పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకున్నారు. టీడీపీని కూడా భాగ‌స్వామ్యం కావాల‌ని కోరారు. అయితే జ‌గ‌న్ పిలుపుతో ఏం చేయాలో పాలుపోని సీఎం చంద్ర‌బాబు వైసీపీ అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
అనూహ్యంగా గుంటూరులో జ‌రిగిన జ‌న‌సేన ఆవిర్భావ‌స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ టీడీపీ పై విమ‌ర్శ‌లు సంధించారు. దీంతో త‌న స్టాండ్ ను మార్చుకున్న టీడీపీ తానే స్వ‌యంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపింది. అంతేకాదు పార్ల‌మెంట్ స‌మావేశాల త‌రువాత ఎన్డీఏలో కొన‌సాగాలా లేదా విడిపోవాలా అని నిర్ణ‌యించుకున్న టీడీపీ ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌తో డైల‌మాలో ప‌డింది. ఎన్డీఏ నుంచి విడిపోయింది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌క‌టించింది. మ‌రి ఏపీ రాజ‌కీయం దేశం మొత్తం తెలిసేలా చేసింది ఎవరు అని అంటే ప్ర‌త్యేకంగా చెప్పేది ఏముంది ప‌వ‌న్ క‌ల్యాణే.

Show Full Article
Print Article
Next Story
More Stories