అజ్ఞాతవాసి సినిమా చూసిన కొద్దిసేప‌టికే ...చనిపోయిన అభిమాని

అజ్ఞాతవాసి సినిమా చూసిన కొద్దిసేప‌టికే ...చనిపోయిన అభిమాని
x
Highlights

సంక్రాతి బ‌రిలో విడుద‌లైన అఙ్ఞాతవాసి సినిమాపై అభిమానులు భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. అయితే ఆ అంచ‌నాల్ని ఏమాత్రం అందుకోలేని అఙ్ఞాతవాసి బాక్సాఫీస్...

సంక్రాతి బ‌రిలో విడుద‌లైన అఙ్ఞాతవాసి సినిమాపై అభిమానులు భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. అయితే ఆ అంచ‌నాల్ని ఏమాత్రం అందుకోలేని అఙ్ఞాతవాసి బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర‌ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అఙ్ఞాతవాసి సినిమా చూసేందుకు వ‌చ్చిన ఓ అభిమాని మృతి చెందాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే యూత్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే ప‌వ‌న్ అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్లు ఊగిపోతుంటారు. ఆ కోవ‌కే చెందుతాడు బ‌ళ్లారిలోని శాస‌వాస‌పురంలో ఉండే రాము. ప‌వ‌న్ అంటే ఎన‌లేని అభిమానం. అయితే అఙ్ఞాతవాసి సినిమా విడుద‌ల నేప‌థ్యంలో త‌న స్నేహితుల‌కు పార్టీ ఇచ్చి ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. ఆ త‌రువాత‌ బుధవారం రాత్రి బళ్లారిలో గంగా అనే థియేట‌ర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అఙ్ఞాతవాసి సినిమాకు వెళ్లాడు. సినిమాకి వెళ్లిన త‌రువాత కొద్దిసేప‌టికి బాత్రూంకి వెళ్లాడు. ఆక్క‌డ ఒక ఫినాయిల్ క‌న‌ప‌డ‌గా అది కూల్ డ్రింక్ అనుకొని తాగేశాడు. అనంత‌రం బాత్రూంలోనే విగ‌త జీవిగా కుప్ప‌కూలిపోయాడు. అంత‌లోనే బాత్రూంకి వ‌చ్చిన ప్రేక్ష‌కులు విగ‌త‌జీవిగా ప‌డిఉన్న రామును థియేటర్ యాజమాన్యం హుటాహుటీన వీఐఎంఎస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ర‌క‌ర‌కాల కోణాల్లో విచారిస్తున్నారు. కూల్ డ్రింక్ అనుకొని ఫినాయిల్ తాగడం అసంభ‌వం . అస‌లే ప‌వ‌న్ హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన రాము అఙ్ఞాతవాసి సినిమా న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడా.లేదా మ‌రేదైనా కార‌ణాలు ఉన్నాయా అన్న‌కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories