మా శవాలు మంత్రి కామినేని ఇంటికి వెళ్తాయి..

Highlights

ఫాతిమా కాలేజీ విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 99 మెడికల్‌ సీట్ల భర్తీకి ఎంసీఐ, కేంద్రప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో విద్యార్ధుల...

ఫాతిమా కాలేజీ విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 99 మెడికల్‌ సీట్ల భర్తీకి ఎంసీఐ, కేంద్రప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో విద్యార్ధుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఫాతిమా మెడికల్ కాలేజ్ విద్యార్థుల కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది ఈ ఏడాది సీట్లు పెంచితే వచ్చే ఏడాది సీట్లు తగ్గించమంటారా అని ధర్మాసనం ప్రశ్నించింది ఎంసీఐ, కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంకోర్టు ఎదుట ఫాతిమా విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలావుంటే మంత్రి కామినేని అసమర్ధతవల్లే తమ పిల్లల బ్రతుకులు ఇలా తయారయ్యాయి.. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే మా శవాలు మంత్రి కామినేని ఇంటికి వెళ్తాయి అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు..

Show Full Article
Print Article
Next Story
More Stories