ప్యాడ్ మ్యాన్..ప్యాడ్ మ్యాన్..ప్యాడ్ మ్యాన్

ప్యాడ్ మ్యాన్..ప్యాడ్ మ్యాన్..ప్యాడ్ మ్యాన్
x
Highlights

గత కొన్నేళ్లలో అద్భుతమైన పాత్రలు.. కథలతో సినిమాలు చేసి తన స్టేచర్ ఎంతో పెంచుకున్నాడు అక్షయ్ కుమార్. ఒకప్పుడు మైండ్ లెస్ యాక్షన్ సినిమాలు... కామెడీ...

గత కొన్నేళ్లలో అద్భుతమైన పాత్రలు.. కథలతో సినిమాలు చేసి తన స్టేచర్ ఎంతో పెంచుకున్నాడు అక్షయ్ కుమార్. ఒకప్పుడు మైండ్ లెస్ యాక్షన్ సినిమాలు... కామెడీ మూవీస్ చేసిన అక్షయ్ నుంచి ఇప్పుడు వస్తున్న సినిమాలు షాకిచ్చేవే. ముఖ్యంగా నిరుడు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ లాంటి షాకింగ్ అండ్ బోల్డ్ మూవీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు అక్షయ్. ఆ సినిమాకు మంచి ఫలితం కూడా దక్కింది.

ఇప్పుడు అక్షయ్ చేసిన మరో సాహసం కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబడుతోంది. నెలవారీ రుతుక్రమంతో బాధపడే మహిళల కోసం తక్కువ ఖర్చుతో శానిటరీ ప్యాడ్స్ తయారు చేసి విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి నిజ జీవిత కథతో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘ప్యాడ్ మ్యాన్’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా అద్భుతం అంటూ అందరూ పొగిడేస్తున్నారు.

ఇలాంటి సినిమా తీసినందుకు దర్శకుడు ఆర్.బాల్కిని.. హీరో అక్షయ్‌ని.. నిర్మాత ట్వింకిల్ ఖన్నా (అక్షయ్ భార్య)ను తెగ పొగిడేస్తున్నారు. బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడని టాపిక్ మీద అర్థవంతమైన సినిమా తీసి జనాల్ని ఎడ్యుకేట్ చేయడమే కాక. ఎంటర్టైన్ చేయడంలోనూ ఈ సినిమా విజయవంతమైందని అంటున్నారు. ప్రముఖ రివ్యూయర్లందరూ దీనికి 3.5-4 మధ్య రేటింగ్స్ ఇచ్చారు. ఈ చిత్రానికి తొలి రోజు రూ.10-12 వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories