దీపిక ముక్కు కోసి తెచ్చిన వారికి

దీపిక ముక్కు కోసి తెచ్చిన వారికి
x
Highlights

పద్మావత్ సినిమా వివాదం తారాస్థాయికి చేరింది. డైర‌క్ట‌ర్ బ‌న్సాలీ రాజ్ పుత్ వంశానికి చెందిన క‌ర్ణిసేనను కించ‌ప‌రిచేలా ప‌ద్మావ‌త్ ను చిత్రీక‌రించారంటూ...


పద్మావత్ సినిమా వివాదం తారాస్థాయికి చేరింది. డైర‌క్ట‌ర్ బ‌న్సాలీ రాజ్ పుత్ వంశానికి చెందిన క‌ర్ణిసేనను కించ‌ప‌రిచేలా ప‌ద్మావ‌త్ ను చిత్రీక‌రించారంటూ ఆ వ‌ర్గం నేత‌లు ఆందోళన చేప‌ట్టారు. దీంతో దేశ వ్యాప్తంగా సినిమా విడుద‌ల కాకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ పోలీసుల ప‌హారాలో సినిమా ఈ రోజు విడుద‌ల చేయ‌డంతో వివాదం ఉదృత‌మైంది. అంతేకాదు సినిమాలో ప‌ద్మావ‌త్ గా యాక్ట్ చేసిన దీపిక ముక్కు కోసి తెచ్చిన వారికి ఐదు ల‌క్ష‌ల్ని బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని క‌ర్ణిసేన ప్ర‌క‌టించింది. క‌ర్ణిసేన‌కు మ‌ద్ద‌త‌కు గా కర్ణిసేన, శ్రీరామ సేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సినిమా విడుద‌ల‌ను నిలిపివేయాలంటూ విధ్వంసం సృష్టించారు. సినిమా థియేటర్ల వద్ద అల‌జ‌డి సృష్టించారు.
అయితే ఈ సినిమా విడుద‌ల‌పై విధ్వంసం సృష్టించ‌డాన్ని ప‌లు రాజ‌కీయ‌పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు.
- సినిమాను విడుదల చేయోద్దంటూ రాజస్థాన్ లోని క‌ర్ణి సేన ఆందోళ‌న చేప‌ట్టింది. అంతేకాదు గురు గ్రామ్ లో ఓ స్కూల్ బ‌స్సుపై దాడికి దిగారు. ఈ దాడితో భ‌యాందోళ‌న‌కు గురైన పిల్ల‌లు ఆర్త‌నాదాల‌తో కాపాడాలంటూ కేక‌లు వేశారు. అయితే స్కూల్ బ‌స్సుపై దాడిని ఖండించిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ దేశంలో ప‌కోడి పాలిటిక్స్ చేస్తున్నార‌ని ద్వ‌జ‌మెత్తారు.
- స్కూల్ బస్ పై దాడిని ఖండించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళ‌న‌పేరుతో ఇళ్లల్లోకి దూరి పిల్లల వెంట పడుతున్నారని, దీనికి మౌనం వహించడం అపరాధమే అవుతుందని విమ‌ర్శించారు.
- సినిమా విడుద‌ల స‌మ‌యంలో విధ్వ‌సం సృష్టించిన వారిని వ‌దొల్ల‌ద‌న్ని యూపీ సీఎం యోగీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. నిర‌స‌న శాంతియుతంగా చేసుకోవాల‌ని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు గస్తీ పెంచాలని, హింసాత్మక సంఘటనలు జరిగితే తక్షణమే స్పందిచాలని యోగి ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories