దీపిక నడుం దాచిపెట్టారు

దీపిక నడుం దాచిపెట్టారు
x
Highlights

సంజ‌య్‌లీలా భ‌న్సాలీ సినిమాలంటే క‌ళాత్మ‌కతకి పెట్టింది పేరు. కెరీర్ ఆరంభం నుంచి ఆయ‌న శైలే అంత‌. ప్ర‌స్తుతం సంజ‌య్‌ తెర‌కెక్కిస్తున్న చిత్రం...

సంజ‌య్‌లీలా భ‌న్సాలీ సినిమాలంటే క‌ళాత్మ‌కతకి పెట్టింది పేరు. కెరీర్ ఆరంభం నుంచి ఆయ‌న శైలే అంత‌. ప్ర‌స్తుతం సంజ‌య్‌ తెర‌కెక్కిస్తున్న చిత్రం 'ప‌ద్మావ‌త్ . దీపికా ప‌దుకునే టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న‌ ఈ సినిమాలో ర‌ణ‌వీర్ సింగ్, షాహిద్ క‌పూర్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ పోస్ట‌ర్స్‌ని ఇవాళ విడుద‌ల చేశారు. ప‌ద్మావ‌త్ గా దీపికా యాక్టింగ్ సూప‌ర్బ్ అని తెలుస్తోంది.
'గోలియోంకీ రాస్‌లీలా రామ్‌లీల‌', 'బాజీరావ్ మ‌స్తానీ' త‌రువాత ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకునే కాంబినేష‌న్‌లో సంజ‌య్‌ తెర‌కెక్కిస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఒకే జంట‌తో వ‌రుస‌గా మూడు సినిమాలు తీసి సంజ‌య్ వార్త‌ల్లో నిలిచాడు. వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌, భ‌న్సాలీ ప్రొడక్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేయ‌నున్నారు. వాస్త‌వానికి ఈ సినిమాని మొద‌ట డింసెబ‌ర్ న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల వాయిదా వేశార‌ని తెలిసింది.
అయితే ఈ నేప‌థ్యంలో సినిమా పాటల్ని విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ కు షాక్ త‌గిలింది. ఈ సినిమాలో ఉన్న ‘ఘూమర్‌’ పాటలో దీపిక నడుం కనిపిస్తోందని, ఓ రాజ్‌పుత్‌ మహారాణి అలాంటి వస్త్రాలు ధరించదని వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన భ‌న్సాలీ ‘ఘూమర్‌’ పాటలో మార్చులు చేశారు. డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు దీపిక నడుం కనిపించకుండా టెక్నాల‌జీని జోడించారు. ఈ మార్పు చేసిన వీడియోను విడుద‌ల చేయ‌డంతో వైర‌ల్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories