ఓయూ ఆడిటోరియం... అవినీతికి మరో రూపం

ఓయూ ఆడిటోరియం... అవినీతికి మరో రూపం
x
Highlights

ఓయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అందినకాడికి దోచుకున్నారని...

ఓయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అందినకాడికి దోచుకున్నారని అంటున్నారు విద్యార్థులు. ఏడాది పాటు తూతూ మంత్రంగా నిర్వహించిన ఉత్సవాల కోసం లక్షల్లో పూర్తయ్యే రినవేషన్‌కు కోట్లలో ఖర్చు పద్దు రాశారని అరోపిస్తున్నారు.

ఇటీవలే ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలు ముగిసాయి. అయితే ఉత్సవాల పేరుతో జరిగిన అవినీతి కాస్త అలస్యంగా బయటపడింది. టాగూర్ ఆడిటోరియం రినవేషన్ కోసం గతంలో 20 లక్షలతో మరమ్మత్తులు చేసారు. అయితే సెంటినరీ సెలబ్రేషన్స్‌లో భాగంగా సైన్స్ కాంగ్రెస్ నిర్వహించేందుకు వెయ్యి మంది కూర్చోగలిగిన అధునాతన ఆడిటోరియంగా మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం 3 కోట్ల 20 లక్షలు ఖర్చవుతాయని ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది.

ఇక్కడే అసలు కథ మొదలైంది. అంతా ఒకే డిపార్ట్‌మెంట్ చేస్తే మనకేం వస్తుంది అనుకున్నారో ఏమో పనుల విభజన పేరుతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేసారు. అంచనాలను నాలుగున్నర కోట్లకు పెంచారు. అవి కుడా రూసా నిధులు ఉపయోగించాని ప్లాన్ చేసారు. అయితే టాగూర్ ఆడిటోరియం బాగానే ఉందని.. దాన్ని రినవేషన్ చేస్తే లక్షల్లో పనవుతుంది తప్ప కోట్లు కావని విద్యార్దులు అరోపిస్తున్నారు. అదే ఖర్చుతో కొత్త ఆడిటోరియం నిర్మించవచ్చంటున్నారు.
విజివల్స్ .. ఓయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్,,, ఓయూ విసి ఫోటో... టాగూర్ ఆడిటోరియం విజివల్స్ వాడగలరు.

మొదట అంచనాల మేరకు చీఫ్ ఇంజనీర్ ఫైల్ అప్రూవ్ చేశాక పనుల విభజన పేరుతో వేరే డిపార్ట్‌మెంట్ కు తరలించడంతో ఇందులో లొసుగు బయట పడింది. సివిల్ వర్క్ ప్రారంభమయ్యక అధికారులు అడిగితే పంపిన ఫైల్ తిరిగి రాలేదు. వర్క్స్ ఎవరు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో కూడా తనకు తెలియదని స్వయంగా చీఫ్ ఇంజినీర్ చెబుతున్నారంటే ఎంత పెద్ద స్థాయిలో చక్రం తిరిగిందో అర్థం చేసుకోవచ్చు.

ఓయూ వందేళ్ళ ఉత్సవాల సంధర్బంగా విద్యార్థులకు హాస్టల్స్ కడతాం. అధునాతన ఆడిటోరియం నిర్మిస్తామని చెప్పిన అధికారులు.. పాత వాటికే సున్నాలు వేసి కాంట్రాక్టర్లతో కలిసి కోట్లు దండుకున్నారని విద్యార్థులు అంటున్నారు. లైసెన్స్ లేని కాంట్రక్టర్లకు పనులు అప్పజెప్పి కమీషన్స్ తీసుకున్నారని.. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అవినీతిపై విచారణ జరిపించాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. ఇంతా రచ్చకు కారణమైన ఠాగూర్ ఆడిటోరియంలోనే పేయింటిగ్స్ వేసి ముగింపు వేడుకలు జరిపారు ఓయూ అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories