ఓ మైగాడ్ ఈ టీనేజ‌ర్ కు 232 ప‌ళ్లు

ఓ మైగాడ్ ఈ టీనేజ‌ర్ కు 232 ప‌ళ్లు
x
Highlights

ఓ మైగాడ్ ఈ టీనేజ‌ర్ కు 232 ప‌ళ్లు మ‌నకున్న 32 ప‌ళ్ల‌ను కాపాడుకోవ‌డానికి నానా తంటాలు పడుతుంటాం. అలాంటిది 232 ప‌ళ్లు ఉన్న ఈ టీనేజ‌ర్ ఇంకెలా ఉంటాడు....

ఓ మైగాడ్ ఈ టీనేజ‌ర్ కు 232 ప‌ళ్లు
మ‌నకున్న 32 ప‌ళ్ల‌ను కాపాడుకోవ‌డానికి నానా తంటాలు పడుతుంటాం. అలాంటిది 232 ప‌ళ్లు ఉన్న ఈ టీనేజ‌ర్ ఇంకెలా ఉంటాడు. అషిక్ గార్హై(17) ఈ అబ్బాయికి 232 ప‌ళ్లు ఉన్నాయి. తాను జ‌న్మించిన‌ప్పుడు ఈ ప‌ళ్లు ఉన్నాయ‌ని చెబుతున్నాడు. గ‌త 18నెల‌ల నుంచి అషిక్ పంటి నొప్పితో తీవ్రంగా బాధ‌ప‌డుతున్నాడు. దీనిపై తండ్రి ముంబై వైద్యుల్ని సంప్ర‌దించాడు. వైద్య ప‌రిక్ష‌లు నిర్వహించిన డాక్ట‌ర్లు విస్తుపోయే వాస్త‌వాన్ని వెలుగులోకి తీసుకువ‌చ్చారు. త‌న‌కు క‌నిపించేది 32 ప‌ళ్లైనా మొత్తం 232ప‌ళ్లు ఉన్నాయని చెబుతున్నారు. పుట్టిన‌ప్పుడు ఉన్నాయ‌ని..వాటి తీవ్ర‌త ఇప్పుడు ఎక్కువ అవ్వ‌డం వ‌ల్లే నొప్పి వ‌చ్చింద‌ని సూచిస్తున్నారు. కొన్ని నెలలు పాటు అషిక్ ను వైద్య పర్య‌వేక్ష‌ణ‌లో ఉంచుకున్న డాక్ట‌ర్లు ఎట్ట‌కేలకు 199ప‌ళ్ల‌ను తొల‌గించారు.
అయితే త‌మ 30 ఏళ్ల కెరియ‌ర్ లో ఇలాంటి కేసును ఎప్పుడు చూడ‌లేద‌ని డాక్ట‌ర్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వ్యాధిని వైద్య ప‌రిబాష‌లో కాంప్లెక్స్ ఒడోనోటోమా అంటార‌ని ముంబైకి చెందిన జేజే ఆస్ప‌త్రి వైద్యులు చెబుతున్నారు

స్కూల్ ల్లో చ‌దువుకునే విద్యార్థి 13ఏళ్ల వ‌య‌స్సు లో తండ్రి అయితే చెప్ప‌డానికే వర్ణ‌నాతీతం. స్కూల్ విద్యార్థి తండ్రి అవ్వ‌డం ఏంట‌ని కొంద‌రు అవాక్ అయితే. అదే తండ్రి త‌న‌కు పుట్టిన చిన్నారిని ఆడిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది విన‌డానికి కొంచెం ఆశ్చ‌ర్యంగా ఉన్నాఇది అక్ష‌రాల నిజం. పాటెన్ (13), చాంటెల్లో(15) అనే దంప‌తుల‌కు ఓ చిన్నారి జ‌న్మించింది. వీరి దాంపత్య జీవితంపై ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతుంది. ఇంత చిన్న వ‌య‌సులో త‌ల్లిదండ్రుల బాధ్య‌త‌ను ఎలా పోషిస్తున్నార‌ని మాట్లాడుకుంటున్నారు. దీని గురించి వాళ్లనే ప్ర‌శ్నిస్తే ఇంత చిన్న వ‌య‌సులో త‌ల్లిదండ్రులు అవ్వ‌డం చాలా సంతోషం గా ఉంద‌ని ..పుట్టిన చిన్నారితో పాటు కుటుంబ‌బాధ్య‌త‌లు చ‌క్క‌గా నిర్వ‌హిస్తాన‌ని తండ్రి చాంటెల్లో చెబుతున్నాడు. మ‌రి కుటంబ పోష‌ణ ఎలా అంటే తాము దాని గురించి ఏం ఆలోచించ‌లేద‌ని అంటున్నారు. జాబ్ చేస్తూ ఓ ప‌క్క చ‌దువుతూ కుంటుంబాన్ని పోషించుకుంటాన‌ని దైర్యంగా చెబుతున్నాడు ఈ 13ఏళ్ల తండ్రి

Show Full Article
Print Article
Next Story
More Stories