జేఈఈ మెయిన్‌ పరీక్షల తేదీల్లో మార్పులు

జేఈఈ మెయిన్‌ పరీక్షల తేదీల్లో మార్పులు
x
Highlights

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీల్లో నేషనల్‌...

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్వల్ప మార్పులు చేసింది. జనవరి 6 నుంచి 20 వరకు నిర్వహించాల్సిన పరీక్షలను జనవరి 8 నుంచి 12 వరకు నిర్వహిస్తామని ఎన్‌టీఏ ప్రకటన చేసింది. దరఖాస్తు చేసిన విద్యార్థులు తక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్‌టీఏ వెల్లడించింది. కాగా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను రెండు గంటల ముందే అనుమతిస్తారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాల్సి ఉంటుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అలాగే హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని ఇందుకోసం [email protected]@nic.in ఈ మెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇదిలావుంటే ఈ పరీక్షల నిర్వహణ దేశవ్యాప్తంగా 273 పట్టణాల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్‌ జారీ చేసింది ఎన్‌టీఏ.

Show Full Article
Print Article
Next Story
More Stories