ఎవ్వరికీ హోదా లేదు

ఎవ్వరికీ హోదా లేదు
x
Highlights

ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి కుండబద్దలు కొట్టింది. ప్రత్యేక హోదా కన్నా ఇంతకు ముందు ప్రకటించిన ప్యాకేజీ అమలే ఉత్తమమని...

ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి కుండబద్దలు కొట్టింది. ప్రత్యేక హోదా కన్నా ఇంతకు ముందు ప్రకటించిన ప్యాకేజీ అమలే ఉత్తమమని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ప్యాకేజీని మాత్రమే అమలు చేసి మిగిలిన హామీలు సాధ్యం కావని ప్రకటించాలని ఆర్థిక శాఖ అంచనాకు వచ్చినట్లు సమాచారం. నిన్న ఢిల్లీలో జరిగిన కీలక భేటీలో ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు ఇవ్వాలని టీడీపీ నేతలు కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీకి చెప్పారు. అయితే, హోదాకు బదులు ప్యాకేజీ వైపే ఆర్థిక శాఖ మొగ్గుచూపుతోంది. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఆంధ్రప్రదేశ్ కు కూడా ఇస్తే వెనుకబడిన రాష్ట్రాలైన యూపీ, బంగాల్ , బిహార్ రాష్ట్రాలు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. నిన్న జరిగిన చర్చలో ఆర్థికమంత్రిత్వ శాఖతో చర్చించాకే పన్ను రాయితీలు కల్పించే అంశంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

తెలుగువారి ఆత్మగౌరవం అంటూ ఆంధ్రప్రదేశ్ నేతలు రాజకీయ వేడిని రగులుస్తున్నారని.. ఇలాంటి సెంటిమెంట్ అంశాలకు లొంగితే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ నాలుగేళ్లలో పోలవరం, రెవెన్యూలోటు సహా పలు పద్దుల కింద 12500 కోట్లు రాష్ట్రానికి ఇచ్చినా రాష్ట్రం ఒక్క రూపాయికి కూడా లెక్కలు చూపలేదని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు. ఇప్పుడేమీ యుద్ధాలు జరగడంలేదు కదా.. రక్షణ శాఖకు అన్ని నిధులు ఎందుకని అడిగినా అడుగుతారంటూ ఆర్థికశాఖ ఘాటుగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. సైన్యానికి కేటాయించిన నిధులు కూడా ఏపీకి కేటాయించాలని డిమాండ్ చేసినా చేస్తారని ఆర్థిక శాఖ అధికారులు అన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. ఏపీ కొత్తగా అడుగుతున్న రాయితీలు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఇచ్చిన నిధులపై ప్రతీ పైసాకీ లెక్క చెప్పామని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. ఏపీ బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్న కుటుంబరావు అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీకి అన్యాయం చేసినట్లే కనిపిస్తోందన్నారు. కేంద్రంతో తెగదెంపులు చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎలా సాధించుకోవాలో తమకు తెలుసన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నారు ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు.

Show Full Article
Print Article
Next Story
More Stories