కష్టాల్లో నిర్మల్ కొయ్య బొమ్మలు

కష్టాల్లో నిర్మల్ కొయ్య బొమ్మలు
x
Highlights

ఖండాంతరాలు దాటిన నిర్మల్ కొయ్య బొమ్మను కష్టాలు వీడటం లేదు. బొమ్మల తయారీకి అనువైన కలప లభించకపోవడంతో కళాకారులకు ఉపాధి కరువవుతోంది. బహిరంగ...

ఖండాంతరాలు దాటిన నిర్మల్ కొయ్య బొమ్మను కష్టాలు వీడటం లేదు. బొమ్మల తయారీకి అనువైన కలప లభించకపోవడంతో కళాకారులకు ఉపాధి కరువవుతోంది. బహిరంగ మార్కెట్‌లో కొయ్య బొమ్మలకు ఆదరణ పెరుగుతున్నప్పటికీ ... తయారీకి అవసరమైన కలప అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతో వేలాది మంది కార్మికులు ఉపాధి దొరక్క అవస్ధలు పడాల్సి వస్తోంది. భాష అవసరం లేకుండా భావాన్ని వ్యక్తం చేయగల శక్తి నిర్మల్ బొమ్మదే. అందుకే వీటి తయారిదారులకు డిప్లమాలు చేసిన వారు సైతం సాటి రారు. చిన్న కర్ర ముక్క కనిపిస్తే చాలు...కిలకిలా రామచిలుక నుండి గాండ్రించే పులిలాంటి రూపం సంతరించుకుంటుంది. కర్రలకు ప్రాణాలు పోస్తున్న ఇక్కడికి కళకారులు తమ జీవితాలను మాత్రం వెలుగులు నింపుకోలేకపోతున్నారు.

వందల ఏళ్ల ఘనచరిత్ర నిర్మల్ కొయ్య బొమ్మలది. కాకతీయుల కాలం నుండి నేటి వరకు నిర్మల్ బొమ్మ కనబడితే పోటీపడి కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి కళకారుల చేతుల్లో ప్రాణం పోసుకున్న కళా ఖాండాలను చూసి ఎందరో ప్రముఖులు ముగ్దులయ్యారు. ప్రధానంగా రామాయణం, మహభారత ఇతి వృత్తాలను తెలియజేస్తూ బొమ్మలు వేయడం ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. నాణ్యమైన కళాకారులు, మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా ...అతి ముఖ్యమైన కర్ర వీరికి అందుబాటులో లేకపోవడం పెద్ద శాపంగా మారింది. బొమ్మలు తయారు చేసేందుకు స్థానిక అడవులలో లభించే పొనికి జాతి కర్రను మాత్రమే వినియోగిస్తారు. కళకారులు.అయితే ఈ కర్ర కోరత వల్ల కళకారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పోనికి లభించక పోవడంతో స్దానిక కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనాదిగా వస్తున్న వృత్తిని వదులుకోలేక ... ఇటు పస్తులుండలేక అర్ధాకలితో అలమటిస్తున్నామని ఇక్కడి వారంటున్నారు. ప్రోత్సాహాలు కల్పించాల్సిన ప్రభుత్వాలే ఆదాయ వనరుగా భావిస్తూ పన్నులు వేస్తే ... కళ అంతరించిపోయే ప్రమాదముందంటూ హెచ్చరిస్తున్నారు. చేతి వృత్తులకు తగిన గౌరవం ఇచ్చి పోత్సహించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందంటూ సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories