దేశం వ‌దిలి పారిపోతున్న మాల్యా వార‌సులు

దేశం వ‌దిలి పారిపోతున్న మాల్యా వార‌సులు
x
Highlights

దేశంలో విజ‌య్ మాల్యా వార‌సులు వెలుగులోకి వ‌స్తున్నారంటూ నేష‌న‌ల్ మీడియా క‌థ‌నాల్ని ప్ర‌చారం చేస్తుంది. వ్యాపార కార్య‌క‌లాపాల్ని కొన‌సాగించేందుకు ఈ...

దేశంలో విజ‌య్ మాల్యా వార‌సులు వెలుగులోకి వ‌స్తున్నారంటూ నేష‌న‌ల్ మీడియా క‌థ‌నాల్ని ప్ర‌చారం చేస్తుంది. వ్యాపార కార్య‌క‌లాపాల్ని కొన‌సాగించేందుకు ఈ జ‌ల్సారాయుడు ప‌లు బ్యాంకులు వ‌ద్ద రూ. 9 వేల‌కోట్ల రుణాల్ని పొందాడు. ఆ రుణాల్ని చెల్లించే స‌మ‌యానికి మాల్యా డ‌బ్బుక‌ట్ట‌కుండా మార్చి2న దేశ వ‌దిలి పారిపోయి లండ‌న్ లో త‌ల‌దాచుకుంటున్నాడు. ఆ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తూ..ప‌లు కోర్టుల్లో తాను అమాయ‌కుడినంటూ సానుభూతి పొందే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.
బ్యాంకులకు ఎగ్గొట్టిన రుణాలు :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - రూ. 1600 కోట్లు
ఐడీబీఐ - రూ. 800 కోట్లు
బ్యాంక్ ఆఫ్ ఇండియా - రూ. 650 కోట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా - రూ. 550 కోట్లు
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - రూ. 430 కోట్లు
యూకో బ్యాంక్ - రూ. 320 కోట్లు
కార్పొరేషన్ బ్యాంక్ - రూ. 310 కోట్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ - రూ. 150 కోట్లు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - రూ. 140 కోట్లు
ఫెడరల్ బ్యాంక్ - రూ. 90 కోట్లు
పంజాబ్ సిండికేట్ బ్యాంక్ - రూ. 60 కోట్లు
యాక్సిస్ బ్యాంక్ - రూ. 50 కోట్లు

అయితే తాజాగా మాల్యా వారసులు గా ఇప్ప‌టికే న‌లుగురు ప్ర‌ముఖులు ఉన్న‌ట్లు ఆర్ధిక‌రంగ నిపుణులు చెబుతున్నారు. వారిలో
ఐపీఎల్ ను ప్రపంచానికి ప‌రిచ‌యం చేసిన ల‌లిత్ మోడీ యూకే పారిపోయాడు. ఐపీఎల్ లో అక్ర‌మాలు, ఫెమా చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డం, ఐపీఎల్ చీఫ్ గా ఉంటూ రానున్న కొత్త టీమ్ ఓన‌ర్ షిప్ వివార‌ల‌ను నిబంధ‌న‌లకు విరుద్ధంగా బ‌య‌ట పెట్ట‌డంతో ఈడీ అతనికి నోటీసులు జారీ చేసింది. దీంతో ల‌లిత్ మోడీ దేశం వ‌దిలి పారిపోయాడు. అక్క‌డి నుంచే కోర్టుకు హాజ‌ర‌వుతున్నాడు.
కార్పోరేట్ క‌న్స‌లెంట్ అయిన దీప‌క్ త‌ల్వార్ ఎయిర్ లైన్స్ - ఏవియేష‌న్ కంపెనీల‌కు నిబంధ‌న‌లుకు విరుద్ధంగా మేలు చేశార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఇన్ క‌మ్ ట్యాక్స్ నుంచి త‌ప్పించేందుకు యూఏఈ పారిపోయాడు.
ఆయుధాల డీలర్ సంజయ్ భండారీ ర‌క్ష‌ణ శాఖ కొనుగోళ్లు - డిఫెన్స్ అజ్విజేష‌న్ కౌన్సిల్ తో ఒప్పందాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఢిల్లీ హై కోర్టు ఈ ఒప్పొందాల్ని త‌ప్పుబ‌ట్టింది. దీనికంటే ముందే అతను నేపాల్ మీదుగా విదేశాలకు చెక్కేశాడు.
ఇప్పుడు వ‌జ్రాల వ్యాపారీ నిర‌వ్ మోడీ కూడా దేశంలో అతిపెద్ద రెండో బ్యాంకింగ్ సంస్థ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.11436కోట్లు కుంభకోణానికి తెర‌దించాడు. బయ్యర్స్ క్రెడిట్ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రుణాల్ని పొందాడు. అయితే నిర‌వ్ మోడీ బ్యాంకు లావాదేవీల‌పై అనుమానం వ్య‌క్తం చేసిన పీఎన్బీ ఉన్న‌తాధికారులు సీబీఐకి ఫిర్యాదు చేయడంతో ఈ భారీ స్కాం వెలుగులోకి వ‌చ్చింది. కేసు నిమిత్తం అత‌న్ని ప‌ట్టుకునేలోపే మోడీ స్విర్జ‌ర్లాండ్ కు పారిపోయాడ‌ని , రూ. 5000కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ నేష‌న‌ల్ మీడియా ప్ర‌ముఖంగా క‌థ‌నాల్ని ప్ర‌చురించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories