గ్రీన్‌కార్డు ఆశావహులకు భారీ దెబ్బేసిన ట్రంప్.. భారత వలసదారులకు షాక్..

గ్రీన్‌కార్డు ఆశావహులకు భారీ దెబ్బేసిన ట్రంప్.. భారత వలసదారులకు షాక్..
x
Highlights

అమెరికాలో నివసిస్తున్న వలసదారులపై ట్రంప్ సర్కార్ మరో అస్త్రాన్ని ప్రయోగించబోతుంది.. సెక్షన్‌ 8 కింద ప్రభుత్వం వలసదారులకు ఇచ్చే హౌసింగ్‌...

అమెరికాలో నివసిస్తున్న వలసదారులపై ట్రంప్ సర్కార్ మరో అస్త్రాన్ని ప్రయోగించబోతుంది.. సెక్షన్‌ 8 కింద ప్రభుత్వం వలసదారులకు ఇచ్చే హౌసింగ్‌ వోచర్ల(ఆహారం, నగదు) సాయం పొందుతున్న వలసదారులకు గ్రీన్‌కార్డుల్ని(శాశ్వత నివాసం) నిరాకరించాలన్న ఆలోచనలో ఉంది. ఈ చట్టం కార్యరూపం దాల్చితే అమెరికాలో ఉంటున్న కొంతమంది భారతీయులపై ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశముంది.ఇప్పటికే ఈ నిబంధనపై అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ కార్యదర్శి సంతకం చేశారు. ఇక నిర్ణయం తీసుకోవలసింది క్యాబినెట్ మరియు సెనెట్ సభ్యులే.. ఇదిలావుంటే నివాస మార్పు లేదా వీసా కోరుకునేవారు.. అలాగే అమెరికాలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వలసదారులు.. ఇంతకు ముందెన్నడూ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదని నిరూపించుకోవాలి.. ఆలా నిరూపించుకుంటేనే గ్రీన్ కార్డు లభించేటట్టు వారు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కొత్తగా ఎవరైనా గ్రీన్‌ కార్డు పొందాలంటే వారంతా ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయాన్ని ఆశించకూడని ఆ బిల్లులో పొందుపరిచారు. కేవలం ఆహరం నగదే కాక మెడికేర్‌ కింద తక్కువ ఖర్చుతో మందులు అందుకుంటోన్న వలసదారులకు సైతం గ్రీన్ కార్డు నిరాకరించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే గ్రీన్‌కార్డులు పొందిన వారిపై ఈ నిర్ణయం ప్రభావం ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories