దర్శి బరిలో మరో కొత్త నేత.. ఒంగోలు కన్ఫర్మ్?

దర్శి బరిలో మరో కొత్త నేత.. ఒంగోలు కన్ఫర్మ్?
x
Highlights

ప్రకాశం జిల్లా వైసీపీలో రోజుకోవిధంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో ఆ పార్టీకి వింత పరిస్థితి ఎదురవుతోంది. గతంలో...

ప్రకాశం జిల్లా వైసీపీలో రోజుకోవిధంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో ఆ పార్టీకి వింత పరిస్థితి ఎదురవుతోంది. గతంలో ఈ నియోజకవర్గంనుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పార్టీకి దూరంగా వుంటూ వస్తున్నారు. అప్పుడప్పుడు కార్యకర్తలకోసం మినహా అయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. దాంతో ఆయనకు బదులుగా అక్కడ బాదం మాధవరెడ్డిని ఇంఛార్జిగా నియమించింది వైసీపీ. ఏమైందో ఏమో ఆరునెలలు కూడా గడవకముందే మాధవరెడ్డిని కూడా మార్చెయ్యాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలో దర్శి టికెట్ తనకు ఇవ్వాలని గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ ఇటీవల జగన్ ను కలిశారు. అయితే ఆయనకు దర్శి కాకుండా ఒంగోలు ఇస్తానని జగన్ చెప్పినట్టు సమాచారం. దర్శి టికెట్ కోసం వెళ్లిన తనకు ఒంగోలు ఇస్తానని జగన్ చెప్పిన విషయంపై ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని వేణుగోపాల్ చెప్పారట. ఇక ప్రస్తుతం ఒంగోలు ఇంఛార్జిగా ఉన్న మాజీ మంత్రి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గిద్దలూరు లేదా, దర్శి నుంచి పోటీ చెయ్యాలని అనుకుంటున్నారట. దాంతో ఒంగోలు టికెట్ వేణుగోపాల్ కు కేటాయిస్తే కాపు సామాజిక వర్గ ఓటర్లు కొంత మేర వైసీపీకి అండగా ఉంటారన్న అభిప్రాయంలో ఆ పార్టీ ఉందట. గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి గెలిచారు అశోక్ రెడ్డి.. అయన రెండేళ్ల కిందట పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిపోయారు. దాంతో ప్రస్తుతం అక్కడ సమర్ధమైన అభ్యర్థికోసం వైసీపీ వేచిచూస్తోంది. అదే క్రమంలో దర్శి నుంచి సైతం బాలినేని పోటీ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. అయన అయితే ఖచ్చితంగా గెలుస్తారని శివప్రసాద్ రెడ్డి కూడా అంటున్నారు. మరి దర్శి బరిలో ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories