వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

వాట్సాప్ లో సరికొత్త ఫీచర్
x
Highlights

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా సమాచారాన్ని స్టిక్కర్స్ రూపంలో పంపుకోవచ్చు. ఏ విషయమైనా...

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా సమాచారాన్ని స్టిక్కర్స్ రూపంలో పంపుకోవచ్చు. ఏ విషయమైనా స్టిక్కర్స్ ద్వారా పంపుకోవచ్చు. అలాగే నచ్చిన స్టిక్కర్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని పంపే సదుపాయం ఇందులో ఉంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతమున్న వాట్సాప్ లో కాకుండా అప్‌ డేటెడ్ వెర్షన్ లో అందుబాటులో ఉంది. ఈ స్టిక్కర్స్‌ను వాట్సాప్ నుంచి ఎలా పంపాలో ఇలా చూడండి..

1. ప్రస్తుతం ఉన్న వాట్సాప్ వెర్షన్ వెంటనే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అప్‌డేట్ చేసుకోవాలి.
2. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ‘స్టిక్కర్’ ప్యాక్‌ను డౌన్లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయాలి.
3. ఎవరికైతే స్టికర్స్ పంపాలని అనుకుంటున్నారో వారి చాట్ విండో ఓపెన్ చేయాలి.
4. ఎమోజీ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే.. ఏమోజీ, జిఫ్, పక్కనే స్టిక్కర్స్ ఆప్షన్ కూడా వస్తుంది.
5. స్టిక్కర్స్ ఆప్షన్‌ను టచ్ చేయగానే ముందుగా ఇన్‌స్టాల్ చేసుకున్న స్టిక్కర్స్ కనిపిస్తాయి.
6. స్టిక్కర్స్ ప్యాక్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్‌లోకి వెళ్లి + బటన్ క్లిక్ చేసి కావలసిన స్టిక్కర్లను యాడ్ చేసుకోవాలి.
7. అలా యాడ్ చేసిన స్టిక్కర్లు వాట్సాప్‌ చాట్ లో కనిపిస్తాయి.
8. అందులో కనిపించే స్టిక్కర్లలో నచ్చింది ఎంపిక చేసుకుని అవతలి వాళ్లకు పంపించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories