ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ మృతి..

ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ మృతి..
x
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్, ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి.. ఎన్డీతివారి మృతిచెందారు. అయన తన 93 వ పుట్టిన రోజునాడే...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్, ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల
మాజీ ముఖ్యమంత్రి.. ఎన్డీతివారి మృతిచెందారు. అయన తన 93 వ పుట్టిన రోజునాడే తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో దాదాపు ఏడాది కాలంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవల తివారీ ఆరోగ్యం విషమించింది. దాంతో గురువారం అయన తుదిశ్వాస విడిచినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా మూడు దఫాలు పనిచేసిన ఆయన.. ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి తొలి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు రాజీవ్‌గాంధీ కేబినెట్‌లో విదేశాంగ మంత్రిగా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్డీతివారి.. చాలా పదవులు నిర్వహించారు. అదే పార్టీతో విభేదించారు కూడా.. ఉత్తరాఖండ్‌ ఎన్నికల సమయంలో ఎన్డీ తివారి బీజేపీలో చేరడం సంచలనంగా మారింది. అయితే మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఎన్డీ తివారీకి వివాదాలు కొత్తేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేస్తున్న టైంలోను వివాదంలో చిక్కుకోవడంతో తప్పుకోవాల్సి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories