ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి

ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి
x
Highlights

న‌య‌న‌తార గ‌తంలో చేసిన ప్ర‌తీ సినిమాలో గ్లామ‌రస్ యాక్టింగ్ తో అందాల కనివిందు చేసింది. ముఖ్యంగా బికినీ పాత్ర చేయ‌డానికికైనా సై అంటే సై అంటూ పోటీ...

న‌య‌న‌తార గ‌తంలో చేసిన ప్ర‌తీ సినిమాలో గ్లామ‌రస్ యాక్టింగ్ తో అందాల కనివిందు చేసింది. ముఖ్యంగా బికినీ పాత్ర చేయ‌డానికికైనా సై అంటే సై అంటూ పోటీ పడింది. కానీ ఇప్పుడు మాత్రం కండీష‌న్ తో సినిమా చేస్తున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి. న‌య‌న‌తార ఏ సినిమా చేయాల‌న్నా నిర్మాత‌ల ఒప్పందం ప్ర‌కారం సినిమా ప్ర‌మోష‌న్స్, ఆడియో లాంచ్ , టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మాల‌కు రాన‌ని ఖ‌రాకండీగా చెప్పేస్తుంది. ఆ ష‌ర‌తుల‌కు నిర్మాత‌లు ఒప్పుకుంటేనే సినిమా చేస్తున్న‌ట్లు..లేదంటే రిజ‌క్ట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా న‌య‌న్ గురించి మ‌రో వార్త ఫిల్మింన‌గ‌ర్ స‌ర్కిల్లో చ‌క్కెర్లు కొడుతుంది. ఇన్నిరోజులు ప్ర‌మోష‌న్స్ కు రాన‌ని చెప్పిన న‌య‌న‌తార ఇప్పుడు గ్లామ‌ర‌స్ పాత్ర‌లు చేయ‌న‌ని చెప్పేస్తుంద‌ట‌. లేదంటే సినిమా చేయ‌న‌ని చెబుతుంద‌ట‌. ఏది ఏమైనా న‌య‌న‌తార‌లో మార్పు వ‌చ్చింద‌ని ..గ‌తంలో గ్లామ‌ర‌స్ గా యాక్ట్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌డంలేద‌ని టాక్ . దానికి కార‌ణం డైర‌క్ట‌ర్ విగ్నేష్ శివ‌న్ తో గ‌త కొద్దికాలంగా ప్రేమ‌లో మునిగితేలుతున్న‌ట్లు తెలుస్తోంది. వారి మ‌ధ్య ఉన్న ఒప్పొందం ప్ర‌కారం గ్లామ‌ర‌స్ సినిమాల‌కు దూరంగా ఉంటున్నార‌ట న‌య‌న‌తార‌

Show Full Article
Print Article
Next Story
More Stories