నా పేరు సూర్య... బాక్సాఫీస్‌ హిట్టా?

నా పేరు సూర్య... బాక్సాఫీస్‌ హిట్టా?
x
Highlights

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీ అనుకుంటే పొరపాటే.అల్లు అర్జున్ ఈసారి కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు.దేశభక్తి...

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీ అనుకుంటే పొరపాటే.అల్లు అర్జున్ ఈసారి కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు.దేశభక్తి ఇతివ్రుత్తంతో వైవిధ్యంగా సినిమాను సిద్దం చేశాడు.స్టోరీకి తగ్గట్టే ఫుల్ ఇన్ టెన్షన్ ఉన్న క్యారెక్టర్ తో సినిమాపై భారీ హైప్ తీసుకువచ్చాడు.ఈ సినిమాతో భారీ లక్ష్యాన్నే టార్టెట్ చేశాడు.

రామ్ చరణ్ రంగస్థలంతో సూపర్ హిట్ కొట్టాడు.మహేశ్ బాబు భరత్ అనే నేను తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ఇప్పుడు బన్నీ వంతైంది.నా పేరు సూర్య మూవీతో సమ్మర్ బరిలో నిలిచాడు.చరణ్,మహేశ్ లాగే తాను పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని ఆశపడుతున్నాడు. అల్లు అర్జున్..ఊరమాస్ క్యారెక్టర్,సీరియస్ పాత్రల్లో ఇట్టే ఒదిగిపోతాడు.నాపేరు సూర్యలో ఇంకాస్త పర్ఫామెన్స్ బేస్ పెంచాడు.పుల్లీ ఇన్ టెన్సిటీ ఉన్న సీరియస్ రోల్ చేశాడు.రొటీన్ కమర్షియల్ స్టోరీలా కాకుండా,దేశభక్తి కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఫస్ట్ టైం బన్నీ మిలటరీ రోల్ చేశాడు.

డీజే తో ఫ్లాప్ చవిచూసిన అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాతో మళ్లీ గ్రేస్ పెంచాలని చూస్తున్నాడు.సౌత్ ఇండియా స్టార్ గా అవతరించాలని చూస్తున్నాడు.అందుకే మలయాళం,తమిళ్ భాషల్లోకి వెళుతున్నాడు.దర్శకుడిగా వక్కంతం వంశీ సినిమాపై భారీ హెప్పే పెట్టుకున్నాడు.దర్శకుడిగా నిరూపించుకోవాలని చూస్తున్నాడు.హీరోయిన్ అను ఇమాన్యుయెల్ ఈసినిమా కీలకంగా మారింది.ఈసినిమాతో హిట్ కొడితేనే నెక్ట్స్ స్టార్ హీరోల ఛాన్సులు వస్తాయి.బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ విశాల్,శేఖర్ సంగీతం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories