సీఎం ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధానిని కలవడం ఆనవాయితీ!

సీఎం ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధానిని కలవడం ఆనవాయితీ!
x
Highlights

కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే దినిలో భాగంగానే రాష్ట్రాల పర్యటన...

కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే దినిలో భాగంగానే రాష్ట్రాల పర్యటన కొనసాగుస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో తెలంగాణ సీఎం కెసిఆర్ సమావేశం కానున్నారని తెలంగాణ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ప్రధాని మోడీని కలవడం ఆనవాయితీ అని వినోద్ కుమార్ చెప్పుకొచ్చారు. కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కొన్ని పార్టీలు కావాలనే అసత్యప్రాచరాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఏ ఒక్కరోజు కూడా టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు తెలపలేదని స్పష్టం చేశారు. గడిచిన 60ఏండ్లుగా ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని తెలిపారు.అయితే కేంద్రంలో ప్రాంత్రీయ, జాతీయ పార్టీలే అవకాశం ఇవ్వనేలేదు కాబట్టి దేశంతో ప్రాంత్రీయ పార్టీలనే ఏకం చేయడమే లక్ష్యంగా కెసిఆర్ అడుగులు వెస్తున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories