తల్లీ కొడుకుల ప్రాణం తీసిన పొగ

తల్లీ కొడుకుల ప్రాణం తీసిన పొగ
x
Highlights

హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో దారుణం జరిగింది. ఇంట్లో పొగ చూరడంతో తల్లీ కుమారుడు మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలానికి చెందిన...

హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో దారుణం జరిగింది. ఇంట్లో పొగ చూరడంతో తల్లీ కుమారుడు మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలానికి చెందిన సత్యబాబు, అతని భార్య బుచ్చివేణి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 25లోని ఓ ఇంట్లో పనిచేస్తున్నారు. అక్కడే ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే తుపాను కారణంగా బాగా చలి గాలులు వీస్తుండటంతో వారు ఉండే గదిలో చలి తీవ్రతకు తట్టుకోలేక బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకోవడంతో.. ఇల్లంతా పొగ చుట్టేసింది. దాంతో ఊపిరాడక తల్లీ బుచ్చివేణి 37 , కుమారుడు పద్మరాజు 20 మృతిచెందారు.. భారీగా పొగ వస్తుండటంతో భయబ్రాంతులకు గురైన సత్యబాబు బయటి నుంచి ఎంతసేపు తలుపుకొట్టినా తీయలేదు. ఈ తలుపులు బద్దలుకొట్టి చూడగా బుచ్చివేణి, పద్మరాజు విగతజీవులుగా పడివున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా వారు పనిచేస్తున్న యజమాని ఇంట్లో కుక్క కూడా నిన్ననే చనిపోయింది. ఈ విషయంపై ఏదైనా గొడవ జరిగి వారు ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories