త్వరలో మరో బాంబు పేల్చనున్న మోడీ..!

Highlights

డిజిటల్ లావాదేవీలు పెంచటం, నగదు రహితంగా బ్యాంకులను మార్చటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. చెక్కులను రద్దు...

డిజిటల్ లావాదేవీలు పెంచటం, నగదు రహితంగా బ్యాంకులను మార్చటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. చెక్కులను రద్దు చేయాలనే ఆలోచన చేస్తుంది. నోట్ల రద్దు తర్వాత చెక్కుల ద్వారా లావాదేవీలు గతం కంటే పెరిగాయి. నోట్ల రద్దు తర్వాత కూడా 91శాతం నగదు చెలామణిలో ఉంది. అదే విధంగా ప్రస్తుతం బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీల్లో 95శాతం చెక్కులు, నగదు ద్వారానే జరుగుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత కూడా డిజిటల్ వైపు జనం మొగ్గుచూపటం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చెక్కులు రద్దు చేయాలని భావిస్తోంది కేంద్రం. దీని ద్వారా ప్రస్తుతం ఒక బిలియన్ గా ఉన్న డిజిటల్ లావాదేవీలను.. ప్రభుత్వం టార్గెట్ అయిన 25 బిలియన్స్ (2వేల 500కోట్ల)కి చేరవచ్చని భావిస్తోంది.

నోట్ల ముద్రణకు ప్రభుత్వం 25వేల కోట్లు ఖర్చు చేస్తోంది. భ్రదత కోసం మరో 6వేల కోట్లు వెచ్చిస్తుంది. డిజిటల్ లావాదేవీల వల్ల ఈ ఖర్చును ఆదా చేసుకోవచ్చని చెబుతోంది. దీనిపై ఆర్థిక నిపుణులు, బ్యాంక్ ఖాతాదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డెబిట్ కార్డుపై ఒక శాతం, క్రెడిట్ కార్డులో 2శాతం ఛార్జీలు విధిస్తున్నారని.. వీటిని తొలగించటం లేదా తగ్గించటం ద్వారా డిజిటల్ లావాదేవీలను పెంచుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 2016 నవంబర్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు డిజిటల్ పేమెంట్స్ 31శాతం పెరిగాయి. ప్రతి వెయ్యి మందిలో కేవలం 180 నుంచి 190 మంది మాత్రమే కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి ఇది చాలా దూరం. మిగిలిన 800 మందిని కూడా డిజిటల్ వైపు తీసుకురావాలంటే చెక్కులను రద్దు చేస్తే ఫలితం బాగుంటుదని భావిస్తున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories